twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎమోషన్ అయ్యారు! చిరంజీవి ఈ పనులు చేస్తున్నారేంటి?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రం రషెస్ చూసిన చిరంజీవి ఎమోషన్ అయ్యారట. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ చిరంజీవి వేలు పెడుతుండటం చర్చనీయాంశం అయింది. ఈ చిత్రం స్టోరీ చిరంజీవి ఓకే చేసిన తర్వాతనే సినిమా పట్టాలెక్కింది. కేవలం స్టోరీ సెలక్షన్‌తో ఆగలేదు చిరంజీవి. తనకు నచ్చక పోవడంతో ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రంలో చాలా మార్పులు, చేర్పులు చేయించారు. ప్రకాష్ రాజ్ పాత్ర అలా వచ్చిందే. అంతు ముందు ఈ పాత్ర వేరొకరితో చేయించారు. చిరంజీవికి నచ్చక పోడంతో ప్రకాష్ రాజ్‌ను తీసుకుని రీ షూట్ చేయించారు.

    సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని చిరంజీవి దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ దగ్గర నుండి ప్రమోషన్ పనులు దాకా ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ విషయాన్ని చిరంజీవే స్వయంగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

    ఈ చిత్రాన్ని భారీ హిట్ చేయాలని చిరంజీవి పరితపిస్తున్నారు. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా మార్కెటింగ్ వ్యూహాలను అనుసరిస్తున్నారు. సినిమా విడుదలను అక్టోబర్ 1న ప్లాన్ చేసింది కూడా చిరంజీవే. వరుసగా సెలవులు, దసరా హాలిడేస్ కావడంతో కలెక్షన్ల పరంగా కలిసొస్తుందని ఆశిస్తున్నారు.

    Chiranjeevi goes emotional watching 'Govindhudu Andarivadele'!

    మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' కధానాయకునిగా క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో అగ్రనిర్మాత బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం పై నిర్మిస్తున్న 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం ప్రస్తుతం లండన్ లోని పలు సుందరమైన ప్రదేశాలలో పాటల చిత్రీకరణ జరుపు కుంటోంది. ఈనెల 15న చిత్రం ఆడియోను అక్టోబర్ 1 న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు.

    శ్రీకాంత్, కాజల్అగర్వాల్, ప్రకాష్ రాజ్, కమలిని ముఖర్జీ, జయసుధ, ఎం యస్. నారాయణ, పరుచూరి వెంకటేశ్వరరావు, రఘుబాబు, పోసానిక్రిష్ణమురళి, కాదంబరి కిరణ్, కాశీ విశ్వనాద్, సమీర్, కారుమంచిరఘు, గిరిధర్, ప్రగతి, సత్య కృష్ణన్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి రచన: పరుచూరి బ్రదర్స్, కెమెరా : సమీర్ రెడ్డి, సంగీతం: యువన్ శంకర్ రాజా, ఆర్ట్: అశోక్ కుమార్, ఎడిటింగ్: నవీన్, ఫైట్స్: పీటర్ హైన్స్,రామ్ లక్ష్మణ్, సమర్పణ: శివబాబు బండ్ల, బ్యానర్: పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్.

    English summary
    Megastar Chiranjeevi had reportedly watched the rushes of Mega Power Star Ram Charan's 'Govindhudu Andarivadele' recently. No sooner had he watched the movie than he turned emotional and shed tears.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X