»   » మోహన్‌ బాబు ఒక అడుగు వెనక్కు వేసి..చిరంజీవి

మోహన్‌ బాబు ఒక అడుగు వెనక్కు వేసి..చిరంజీవి

Posted By:
Subscribe to Filmibeat Telugu

మోహన్‌ బాబు ఒక అడుగు వెనక్కు వేసి తన తనయను నిర్మాతగా నిలబెట్టి ప్రోత్సహించారు. పిల్లలను ప్రోత్సహించడంవల్ల కొత్తదనంతో కూడిన సినిమాలు వచ్చే అవకాశం ఉంది అన్నారు మెగాస్టార్ చిరంజీవి. 'ఝుమ్మంది నాదం' ఆడియో పంక్షన్ కి గెస్ట్ గా హాజరైన చిరంజీవి ఇలా స్పందించారు. ఆయన మాటల్లోనే...అనుకునో లేక అనుకోకుండానో వేరే రంగం (రాజకీయ)లోకి అడుగుపెట్టాను. అక్కడ మానసిక ఒత్తిడి తప్పదు. నేనేదో ఇక్కడ 'మిస్‌' అవుతున్నానని కాదు. రాజకీయాల్లోకి వెళ్లినందుకు నో రిగ్రెట్స్‌.

కానీ ఈ వేడుక నా కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా గడుపుతున్న భావనను కలిగిస్తోంది. ఈ అవకాశం ఇచ్చినందుకు మోహన్‌ బాబుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నో సంవత్సరాల క్రితం వేటూరి కలం నుంచి జాలువారిన పాట 'ఝుమ్మంది నాదం'. ఇప్పుడు అదే పాటనే టైటిల్‌ గా చేసుకుని ఈ చిత్రం రూపొందించడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం విజయం తథ్యం' అని చిరంజీవి అన్నారు. మనోజ్‌, తాప్సి జంటగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మించిన చిత్రం 'ఝుమ్మంది నాదం'. ఎం ఎం కీరవాణి సంగీతం అందించిన పాటలు ఆదిత్య మ్యూజిక్‌ వారు పంపిణీ చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu