twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘పాడుతా తీయగా’ ప్రారంభించిన చిరంజీవి

    By Bojja Kumar
    |

    యూఎస్ఏ : ఎస్‌పి బాల సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని టీవీ కార్యక్రమం 'పాడుతా తీయగా' కార్యక్రమానికి తెలుగునాట మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కార్యక్రమాన్ని అమెరికాలోని తెలుగు వారి కోసం అక్కడ ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి అమెరికాలో కొత్తగా మొదలు కాబోతున్న 'పాడుతా తీయగా' కార్యక్రమాన్ని ప్రారంభించారు.

    తానా(తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) ఆధ్వర్యంలో ఇక్కడ పాడుతా తీయగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పాడుతా తీయగా కార్యక్రమాన్ని అమెరికాలో తెలుగు వారు ఎక్కువగా నివాసం ఉండే వివిధ నగరాల్లో కొనసాగించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    ఇప్పటి వరకు వివిధ వయసుల వారు పాడుతా తీయగా కార్యక్రమంలో పాల్గొని తెలుగు సంగీతాభిమానులను అలరించారు. అయితే తొలిసారిగా విదేశాల్లో స్థిర పడ్డ ప్రవాసాంధ్రుల గొంతు 'పాడుతా తీయగా' కార్యక్రమంలో వినపడబోతోంది. విదేశాల్లో ఉంటున్నా భారతీయ సంగీతంపై మమకారంతో సాధన చేస్తున్న వారి ప్రతిభ పాఠవాలు ఈకార్యక్రమం ద్వారా అందిరికీ తెలియనున్నాయి.

    English summary
    Megastar Chiranjeevi has inaugurated the inaugural episode of Padutha Theeyaga at TANA (Telugu association of North America) in USA. He has appreciated the participants in the programme.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X