»   » మెగాస్టార్ మీసం మాయం.. అందుకే చిరంజీవి తీసేశారట..

మెగాస్టార్ మీసం మాయం.. అందుకే చిరంజీవి తీసేశారట..

Written By:
Subscribe to Filmibeat Telugu

రంజిత్, పాల‌క్ ల‌ల్వానీ జంటగా 'దిక్కులు చూడ‌కు రామయ్య‌' ఫేమ్ త్రికోటి పేట ద‌ర్శ‌క‌త్వంలో రూపొంతోన్న చిత్రం 'జువ్వ‌'. ఎస్.వి. ర‌మ‌ణ స‌మ‌ర్ప‌ణ‌లో సొమ్మి ఫిలింస్ పై డా. భ‌ర‌త్ సోమి నిర్మిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ ను శనివారం ఉదయం మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.

క్యారెక్టర్ పరంగా పక్కా మాస్

క్యారెక్టర్ పరంగా పక్కా మాస్

చిరంజీవి మాట్లాడుతూ- "అందరికి హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజు 'జువ్వ' ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేయడం హ్యాపీగా ఉంది. టీజర్ లో రంజిత్డైనమిక్ గా, హుషారుగా కనిపించాడు. క్యారెక్టర్ పరంగా పక్కా మాస్ అని అర్థమవుతోంది. హీరోయిన్ పాలక్ లల్వానీ రొమాంటిక్ గా, అందంగా కనిపించింది

హీరో, ప్రొడ్యూసర్ అన్నదమ్ములు

హీరో, ప్రొడ్యూసర్ అన్నదమ్ములు

హీరో రంజిత్, ప్రొడ్యూసర్ భరత్ అన్నదమ్ములు. వీళ్ల నాన్నగారితోనాకు మంచి పరిచయం ఉంది. స్వతహాగా భరత్ డాక్టర్. సాధారణంగా యాక్టర్ కాబోయి డాక్టర్ అయ్యామనే మాటలు వింటుంటాం. కానీ, తమ్ముడి కోసం డాక్టర్భరత్ ప్రొడ్యూసర్ అయ్యాడు. ఆ విధంగా అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా ఈ సినిమా నిలబడింది.

రాజమౌళి శిష్యుడు త్రికోటి

రాజమౌళి శిష్యుడు త్రికోటి

రాజమౌళి శిష్యుడు త్రికోటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వీళ్లిద్దరి కోసం తప్పకుండా చూస్తా. 'దిక్కులు చూడకు రామయ్య' తర్వాత దర్శకుడుత్రికోటి మరో హిట్ అందుకోవాలని కోరుకుంటున్నా'' అని చిరంజీవి అన్నారు.

చిరంజీవిగారి నటన

చిరంజీవిగారి నటన

హీరో రంజిత్ మాట్లాడుతూ- "చిరంజీవిగారి నటన అంటే నాకెంతో ఇష్టం. హి ఈజ్ మై రోల్ మోడల్ అండ్ఇన్స్పిరేషన్. ఆయనతో ఒక్క ఫోటో దిగితే చాలు అనుకునేవాడిని. ఈరోజు నేను హీరోగా పరిచయం అవుతున్న సినిమా టీజర్ ను సార్ విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఐ లవ్ చిరంజీవి. నేను ఎపుడైనా లోన్లీగా ఫీల్ అయినప్పుడు యుట్యూబ్ లో చిరంజీవిగారి పాటలే చూస్తా'' అన్నారు.

చిరంజీవిగారి చేతుల మీదుగా

చిరంజీవిగారి చేతుల మీదుగా

దర్శకుడు త్రికోటి మాట్లాడుతూ- "చిరంజీవిగారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం సంతోషంగా ఉంది. ప్రేమకథతో రూపొందిన సినిమా ఇది. చిన్న చిన్న థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి" అన్నారు.

ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ విడుదల

ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ విడుదల

ప్రొడ్యూసర్ భరత్మాట్లాడుతూ- "ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ విడుదల చేసిన చిరంజీవిగారికి థాంక్స్.2017లో మాసినిమా షూటింగ్ పూర్తయింది. ఈ నెలాఖరున ఆడియోని, ఫిబ్రవరిలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.

ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ సురేష్ పాల్గొన్నారు.

చిరంజీవి మీసం లేకుండా

చిరంజీవి మీసం లేకుండా

కాగా, ఈ కార్యక్రమంలో చిరంజీవి మీసం లేకుండా కొత్తగా కనిపించారు. మీసం మాయం వెనకు కారణం ఏమిటని పాత్రికేయులు అడుగగా.. సైరా నరసింహారెడ్డి చిత్రం కోసం తీసేశాని, గ్రాఫిక్స్ కోసం ముఖ కవలికల కొలతల కోసం మీసం తీసేశానని చిరంజీవి చెప్పారు. గతంలో చంటబ్బాయి చిత్రం కోసం మెగాస్టార్ మీసాన్ని త్యాగాన్ని చేసిన సంగతి తెలిసిందే.

నటీనటులు, సాంకేతికవర్గం

నటీనటులు, సాంకేతికవర్గం

జువ్వ చిత్రంలో పోసాని కృష్ణ ముర‌ళి, అలీ, స‌ప్త‌గిరి, ముర‌ళీ శ‌ర్మ‌, ర‌ఘుబాబు, ప్ర‌భాక‌ర్, విజయ్ చంద‌ర్, ఆనంద్, ఐనాక్స్ వెంక‌ట్, పింగ్ పాంగ్ సూర్య‌, జ‌బ‌ర్ధ‌స్త్ శ్రీను, షేకింగ్ షేషు, సారిక రామ‌చంద్ర‌రావు, ఏడిద శ్రీరాం, మోహ‌న్ రావు, హిమ‌జా, మునిరాజు, ల‌త‌, తుల‌సి, ప్ర‌స‌న్న కుమార్, ప్ర‌భాష్ శ్రీను, రాజేష్‌, భ‌ద్ర‌మ్, సురేఖా వాణి, స‌నా, దువ్వాసి మోహ‌న్ , ప్ర‌జ్వాల్, ఆయుష్, ఎస్తార్ అనీల్, విష్ణు ప్రియ‌, ప‌ద్మ‌జా, ఫ‌రీద్, క‌బీర్, అజ‌ర్, నాగు త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

తెర వెనుక

తెర వెనుక

ఈ చిత్రానికి క‌థ, మాట‌లు: ఎమ్. ర‌త్నం, సాహిత్యం: అనంత శ్రీరాం, వ‌శిష్టి, కొరియోగ్ర‌ఫీ: గ‌ణేష్, జానీ, ఎడిటింగ్: కోట‌గిరి వెంకటేశ్వ‌ర‌రావు, త‌మ్మిరాజు, యాక్ష‌న్: వెంక‌ట్, నందు, ఆర్ట్: రామ్ అర‌స‌విల్లి, సినిమాటోగ్ర‌ఫీ: సురేష్‌, సంగీతం: ఎమ్.ఎమ్. కీర‌వాణి, నిర్మాత : డా. భ‌ర‌త్ సోమి, స్ర్కీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: త్రికోటి పేట‌.

English summary
Juvva Movie 1st Look Poster and Trailer Launch held at Chiranjeevi's residence at Hyderabad, Chiranjeevi released the 1st Look Poster and Trailer today (13thJan) morning. Ranjith and Palak Lalvani pairing this movie. Doctor Bharat Somi is the producer. Chiranjeevi wishes entire team to success in this event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X