»   » మెగా మదర్, బన్నీ, ఇంకా మెగా ఫ్యామిలీ మొత్తం: థియేటర్ వద్ద సందడే సందడి!

మెగా మదర్, బన్నీ, ఇంకా మెగా ఫ్యామిలీ మొత్తం: థియేటర్ వద్ద సందడే సందడి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా స్టార్ చిరంజీవి దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ థియేటర్లోకి వచ్చారు. ఆయన నటించి 'ఖైదీ నెం 150' చిత్రం చూసేందుకు అభిమాన లోకం అంతా థియేటర్ల వైపు కదులుతున్నారు. మెగాస్టార్ పదేళ్ల తర్వా వస్తున్న నేపథ్యంలో.... అభిమానుల ఉత్సాహం, కోలాహలం స్వయంగా చూసేందుకు మెగా ఫ్యామిలీ మొత్తం కదిలింది.

చిరంజీవి తల్లి అంజనా దేవితో పాటు భార్య సురేఖ, కూతురు సుస్మిత, అల్లు అర్జున్ దంపతులు, మరికొందరు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమాన సందోహం మధ్య వారు 'ఖైదీ నెం 150' సినిమా వీక్షించారు


తొమ్మిదేళ్ల తర్వాత తన కొడుకు నటించిన ఖైదీ సినిమా అద్భుతంగా ఉందని, 60 ఏళ్ల వయసులో కూడా తన నటన, డ్యాన్సులతో చిరంజీవి అదరగొట్టాడని, ఇది అభిమానులందరికి ఇది నిజమైన సంక్రాంతి అని అంజనా దేవి అన్నారు..


పట్టుబట్టి మరీ

పట్టుబట్టి మరీ

ఖైదీ నెం 150 సినిమా స్పెషల్ షో గత కొన్ని రోజుల క్రితమే వేసారు. ఆ సమయంలో తల్లి అంజనా దేవిని తీసుకెళ్లాలని చిరంజీవి ప్రయత్నించగా... తాను ఈ షో చూడనని, విడుదలరోజు అభిమానులతో కలిసి చూస్తానని చెప్పారట. ఈ విషయాన్ని ఆ మధ్య స్వయంగా చిరంజీవి వెల్లడించారు. అప్పుడు చెప్పిన విధంగానే అంజనా దేవి అభిమానులతో కలిసి కొడుకు నటించిన 150వ సినిమాను వీక్షించారు.


సురేఖ, సుస్మిత తదితరులు

సురేఖ, సుస్మిత తదితరులు

‘ఖైదీ నెం 150' చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ పతాకంపై చిరంజీవి సతీమణి సురేఖ నిర్మించారు. తన నిర్మాణంలో వచ్చిన తొలి సినిమాను, మెగా అభిమానుల సందడి చూసేందుకు కూతురు సుష్మిత, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు.


 బన్నీ-స్నేహ

బన్నీ-స్నేహ

‘ఖైదీ నెం 150' స్పెషల్ షో చూసేందుకు బన్నీ తన భార్య స్నేహా రెడ్డితో కలిసి హాజరయ్యారు. భారీ సంఖ్యలో అభిమాన సందోహం మధ్య ఆయన ఈ సినిమా వీక్షించారు. మెగా ఫ్యామిలీ రాకతో థియేటర్ వద్ద సందడి వాతావరణం నెలకొంది.


అభిమానులకు అభివాదం

అభిమానులకు అభివాదం

సంధ్య థియేటర్ వద్ద అభిమానులకు అభివాదం చేస్తున్న అల్లు అర్జున్.


అభిమానులు

అభిమానులు

‘ఖైదీ నెం 150' రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద భారీ సంఖ్యలో అభిమానుల రాకతో కోలాహలం నెలకొంది. గతంలో కంటే భారీ సంఖ్యలో థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయడంతో తొలి రోజు సినిమా చూడాలనే మెగా అభిమానుల ఆకాంక్ష చాలా వరకు నెరవేరిందనే చెప్పాలి.


English summary
Chiranjeevi Mother and family members at Sandhya Theater For Watching Khaidi No 150 Movie. On the other hand, the enthusiastic fans and the general audience have a gala time to celebrate the occasion ahead of watching their star's film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu