»   »  చిరు ప్రజాబంధువా?

చిరు ప్రజాబంధువా?

Posted By:
Subscribe to Filmibeat Telugu


చిరంజీవి రాజకీయపార్టీ పెడతాడో లేడోకానీ ఆయన ప్రభావం మాత్రం ఒక ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉంది. దేశ రాజకీయాలలో రాష్ట్రం కీలకం కావడంతో చిరంజీవి రాజకీయ పార్టీ పెడితే ఎలా అనే మథనం అందరి మనసులో కలవరం రేపుతోంది. అందకే అన్ని రాజకీయ పార్టీలు తమ సొంతపనులు మానుకొని చిరంజీవిని వేయికళ్లతో గమనిస్తున్నాయి.

రాజకీయ పార్టీల తీరు ఇలా ఉంటే చిరంజీవి తీరు మరోలా ఉంది. ఆయన తన 149వ చిత్రాన్ని ఎలా తీర్చి దిద్దాలా అని మధన పడుతున్నాడు. ఏ దర్శకుడితో ఆ సినిమాను రూపొందిచాలా అని తీవ్రంగా చర్చలు జరుపుతున్నారు. రాజకీయాలకు సంబంధించిన సినిమా తీసి ఆ వెంటనే రాజకీయ అరంగేట్రం చేయాలని చిరంజీవి యోచిస్తున్నాడు. దర్శకుడెవరైనా కథ మాత్రం రాజకీయాల చుట్టే ఉంటుందని ఫిల్మ్ నగర్ సమాచారం. చిరంజీవి 149వ చిత్రం పేరు ప్రజాబంధు కావచ్చని కూడా అనుకుంటున్నారు. దర్శకులలో వివివినాయక్, ఎన్.శంకర్, పూరి జగన్నాథ్ లలో ఎవరో ఒకరు ఉంటారని ఊహిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X