»   » ముద్దు సీన్లో చిరంజీవి ఫెయిల్, మోహన్ బాబు ఫన్నీ!

ముద్దు సీన్లో చిరంజీవి ఫెయిల్, మోహన్ బాబు ఫన్నీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నిన్నటి తరం గ్లామరస్ హీరోయిన్ నగ్మ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ఆ కాలంలోనే తెలుగు చిత్ర సీమను తన గ్లామర్‌తో ఓ ఊపు ఊపింది. మెగాస్టార్ చిరంజీవితో ‘ఘరానా మొగుడు' చిత్రంలో నగ్మ పెర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఓ సెన్సేషన్.

ఆ సినిమా చేసే నాటికి నగ్మ పెద్ద స్టార్ హీరోయిన్ కూడా కాదు. దాదాపు మూడు బాలీవుడ్ చిత్రాల్లో మాత్రమే నటించింది. అందులో ఒకటి రొమాంటిక్ డైరెక్టర్ ఫిరోజ్ ఖాన్ దర్శకత్వంలో కూడా చేసింది. అప్పటికి ఆమెకు లిప్ లాక్ సన్నివేశాల్లో నటించిన అనుభవం కూడా ఉంది. తక్కువ సినిమాలతోనే అప్పట్లో గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

బాలీవుడ్ సినిమాల్లో నగ్మను గ్లామర్ చూసి ముగ్దుడైన రాఘేవేంద్రరావు ‘ఘరానా మొగుడు' చిత్రానికి తీసుకున్నారు. చిరంజీవి-నగ్మలపై ఈ సినిమాలో ముద్దు సీన్లు కూడా ప్లాన్ చేసారు. అప్పటికే ముద్దు సీన్లు చేసి ఆరితేరిన నగ్న బాగానే నటించినా..... చిరంజీవి మాత్రం ఆమె పెదాలను పర్ ఫెక్టుగా ముద్దాడలేక ఇబ్బంది పడ్డాట. ఆ సీన్ సరిగా రాక పోవడంతో ఫైనల్ వెర్షన్ ఎడిటింగులో ఆ ముద్దు సీన్ కట్ చేసారట. ఈ విషయాలన్నీ రాఘవేంద్రరావు సౌందర్య లహరి కార్యక్రమంలో బయట పడ్డాయి.

Chiranjeevi not comfortable doing the lip-lock

ఈ విషయం గురించి నగ్మ మాట్లాడుతూ...‘అపుడు లిప్ లాక్ సీన్ చేయడంలో చిరంజీవిగారు చాలా ఇబ్బంది పడ్డారు. సరిగా చేయలేక పోయారు. ఆ సీన్ చాలా బ్యాడ్ గా వచ్చింది. ఆ సీన్ ఉంటే ఆయన ఇమేజ్ డ్యామేజీ అవుతుందని కట్ చేసారు' అంటూ నగ్మ చెప్పుకొచ్చంది.

ఈ కార్యక్రమంలో తను నటించిన పలువురు తెలుగు హీరోల గురించి తన అభిప్రాయాలు చెప్పుకొచ్చింది నగ్మ. పంక్చువాలిటీకి మారుపేరైన మోహన్ బాబును ఇండస్ట్రీలో అందరూ డిక్టేర్ అంటుంటే...‘మేజర్ చంద్రకాంత్' చిత్రంలో ఆమెతో నటించిన నగ్మ మాత్రం అతన్ని ఫన్నీ మేన్ అనేసింది. చిరంజీవి చాలా మంచి వాడని, బాలయ్యను కృష్ణుడు అని, వెంకీని సెంటిమెంట్ మ్యాన్ అని, నాగార్జున మంచి ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది.

English summary
"Chiranjeevi garu was not comfortable doing the lip-lock it seems. He didn't got it right. Fearing that this bad kiss will compromise his image, he opted to chop it out from the final version of movie", said Nagma.
Please Wait while comments are loading...