»   » శోక సముద్రంలో నటుడు బెనర్జీ పరామర్శించిన చిరంజీవి

శోక సముద్రంలో నటుడు బెనర్జీ పరామర్శించిన చిరంజీవి

Posted By: Sreedhar
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నటుడు బెన‌ర్జీ తండ్రి, న‌టుడు రాఘ‌వ‌య్య ఆదివారం ఉద‌యం ఈలోకం వదిలి వెళ్ళిపోయినా సంగతి తెలిసిందే. ఆయ‌న మృతిప‌ట్ల తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు ప్రఘాడ సానుభూతి తెలిపారు. విషయం తెలుసుకున్న చిరంజీవి బెన‌ర్జీ ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు.

చిరంజీవి ఈ సందర్భంగా బెనర్జీ తండ్రి రాఘవయ్య తో ఉన్న అనుభందాన్ని గుర్తు చేసుకున్నారు. సినీ ఇండస్ట్రి లో అకస్మికంగా ఎవరు మరణించినా చిరంజీవి వారి పరామర్శించడం మనం గతంలో చాలా సందర్భాలో చూసాం. సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నా కొన్ని సందర్భాల్లో ఆయన సమయం తీసుకొని మరీ వెళ్ళడం జరిగింది.

Chiranjeevi Pays Homage To Actor Banerjees Father

ఈ మద్య ఒక సందర్భంలో బెనర్జీ మాట్లాడుతూ... చిరంజీవి జీవితంలో అనేక ఆసక్తికర మలుపులున్నాయి. అవన్నీ పేపర్ మీద పెడితే అది గొప్ప స్క్రిప్టు అవుతుంది. దాన్ని సినిమా తీస్తే బాగుంటుందని బెనర్జీ తెలిపారు. బెనర్జీ తండ్రి రాఘవయ్య మృతి వార్తా విని పలువురు సినీ ప్రముఖులు పరామర్శించడం జరుగుతోంది.

English summary
Chiranjeevi Pays Homage To Actor Banerjee's Father Today morning in hydarabad. Benarji is well known telugu acror. he acted lot of telugu films
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X