»   » యువ హీరోలను భయపెడుతున్న ‘చిరు’!?

యువ హీరోలను భయపెడుతున్న ‘చిరు’!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగాస్టార్ చిరంజీవి సినిమా పరిశ్రమలో ఉన్నంతవరుకు ఇతర హీరోలు 'నంబర్ వన్" స్థానం చేరుకోలేకపోయారు. తన కుటుంబానికి చెందిన హీరోలకు తప్ప వేరే అప్ కమింగ్ హీరోలను చిరంజీవి ప్రోత్సహించిన దాఖలాలు కూడా లేవు. అతను రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత చాలా మంది ఊపిరి పీల్చుకున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి మళ్లీ సినిమాల్లో నటించే అవకాశం కనిపిస్తోంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత సభ పక్షనేత గా ఉన్నప్పటికీ సినిమాల్లో నటించడానికి అది అడ్డంకి కాబోదని ఎన్.టి.ఆర్ బాటలో పయనించుటకు సమాయాత్తం అవుతోన్నట్లు సమాచారం.

ప్రస్తుతం మళ్ళీ సినిమాల్లో నటించడం కోసమే, స్లిమ్ గా కన్పించడం కోసమే ఆయన కేరళ వెళ్లి లైపో సక్సన్ అనే కొవ్వు తీయించుకునే చికిత్స చేయించుకున్నట్టు సమాచారం. గతంలో ఇటువంటి చికిత్సను జూనియర్ ఎన్టీఆర్, మంచు విష్ణువర్ధన్ చేయించుకుని స్లిమ్ గా తయారయ్యారు. ఇటీవలే ఈ చికిత్స చేయించుకున్న తర్వాత చిరంజీవి నవ యువకుడిలా కన్పిస్తున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ చిరంజీవి సినిమాల్లోకి వస్తున్నాడని తెలుసుకుని కొంతమంది హీరోలు మొహం మాడ్చుకుంటున్నారట. అతను కనుక రంగంలోకి దిగితే కుర్ర హీరోలకు దారి మూతపడుతుందని, తన కొడుకుని తప్ప మరి ఎవరినీ ఎంకరేజ్ చేయడని మాట్లాడుకుంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu