»   » చిరంజీవి 150: ఆ టైపు సినిమా చేసే ఆలోచన ఉందా?

చిరంజీవి 150: ఆ టైపు సినిమా చేసే ఆలోచన ఉందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి 150వ సినిమా గురించి గత కొంత కాలంగా తెలుగు సినీ సర్కిల్ లో ఆసక్తికరమైన చర్చ సాగుతూనే ఉంది. తొలి నాళ్లలో ఆయన దేశ భక్తి తరహా సినిమాలు చేస్తారని, సందేశంతో కూడిన సినిమాలు చేస్తారనే వాదన వినిపించింది. ఆ తర్వాత చిరంజీవి స్వయంగా స్పందిస్తూ అలాంటి సినిమాలు చేయడం లేదన్నారు.

అభిమానులను అలరించే, పూర్తి స్థాయి ఎంటర్టెన్మెంట్, ఫుల్ కమర్షియల్ వాల్యూస్ తో ఉన్న సినిమా చేస్తానని స్వయంగా చిరంజీవి చెప్పుకొచ్చారు. కొన్ని రోజుల పాటు పూరి జగన్నాథ్ చిరంజీవి ఇమేజ్ కు తగిన విధంగా ఆటోజానీ సబ్జెక్టు తయారు చేసారు. అయితే ఎందుకనో పూరి తయారు చేసిన స్క్రిప్టు చిరంజీవిని పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేక పోయింది. అతనితో సినిమా రద్దయింది.

Chiranjeevi referring Bollywood blockbuster ‘PK’?

తాజాగా చిరంజీవి 150వ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. బాలీవుడ్లో సూపర్ హిట్టయిన ‘పికె' తరహా సినిమాలు చేయడానికి కూడా ఆయన ఆసక్తి చూపుతున్నారట. దాన్ని తెలుగు నేటివిటీకి తగిన విధంగా తీర్చి దిద్దిడం, లేదా ఆ తరహాలో ఏదైనా స్క్రిప్టు ఉంటే చేయడానికి ఆయన సిద్ధమే అనే సంకేతాలు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

‘పికె' సినిమా పెద్ద హిట్టయింది. ఇండియన్ సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. దాంతో పాటు ఈ సినిమా చుట్టూ చాలా వివాదాలు కూడా చుట్టు ముట్టాయి. పలు మత సంస్థలు ఈ సినిమాపై అభ్యంతరాలు సైతం వ్యక్తం చేసాయి. సినిమాలకు సంబంధించిన ఇప్పటి వరకు వివాద రహితుడుగా ఉన్న చిరంజీవి ఇలాంటి కథపై ఆసక్తి చూపడం ఏమిటని కొందరు విస్మయం వక్తం చేస్తున్నారు.

English summary
Close source revealed that deep discussions are going on for this much awaited project and it is heard that some close members to Chiranjeevi are referring Bollywood blockbuster ‘PK’ to Chiranjeevi and asked him to see if it can be changed according to our Telugu nativity.
Please Wait while comments are loading...