»   » చిరంజీవి 150వ సినిమాకు రెమ్యూనరేషన్ ఎంత?

చిరంజీవి 150వ సినిమాకు రెమ్యూనరేషన్ ఎంత?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎట్టకేలకు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మెగా వారసుడు రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఇందుకోసం 'కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ' పేరుతో నిర్మాణ సంస్థను కూడా స్థాపించారు. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం ప్రారంభోత్సవం మెగా ఫ్యామిలీ సమక్షంలో ఇటీవలే గ్రాండ్ గా జరిగింది.

తమిళంలో హిట్టయిన 'కత్తి' అనే చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగిన విధంగా మార్పులు చేసి....చిరంజీవి అభిమానులు మెచ్చే విధంగా తెరకెక్కించేందుకు వివి వినాయక్ ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది.

చిరంజీవి సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారు? అనేది ఇంకా ఖరారు కాలేదు.... నయనతార, తమన్నా ఇలా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. సినిమాకు సంబంధించిన ముఖ్య తారాగణం ఎంపిక కూడా జరుగాల్సి ఉంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు చిరంజీవిని తన కెమెరా ద్వారా మరింత స్టైలిష్ గా చూపించబోతున్నారు.

Chiranjeevi remuneration for 150th Movie Film!

కాగా... ఈ చిత్రానికి చిరంజీవి రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నారు? అనేది చర్చనీయాంశం అయింది. అయినా సినిమా నిర్మిస్తున్నది స్వయంగా కొడుకే కదా.... రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? అనే డౌట్ మాత్రం వద్దు. ఏ లెక్క లెక్కే... సినిమా సినిమానే. ఈ చిత్రానికి చిరంజీవికి రూ. 30 కోట్ల రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.

చిరంజీవి రెమ్యూనరేషన్ రూ. 30 కోట్లు ఫిక్స్ చేసారంటే..... సినిమా బడ్జెట్ రెమ్యూనరేషన్‌తో కలిసి రూ. 50 కోట్లు దాటడం ఖాయం. ఈ చిత్రాన్ని పూర్తి కమర్షియల్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. చిరంజీవికి రూ. 30 కోట్ల రెమ్యూనరేషన్ నిజమే అయితే....తెలుగు సినిమా పరిశ్రమలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న స్టార్ గా చిరంజీవి రికార్డులకెక్కబోతున్నారు.

English summary
Mega Star Chiranjeevi is being paid 30 crores by Ram Charan for 150th film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu