»   » భారీ యక్షన్ తో ప్రారంభం కాబోతున్న చిరు 150

భారీ యక్షన్ తో ప్రారంభం కాబోతున్న చిరు 150

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే అదిరిపోయే ఫైట్లు, డాన్సులు, పాటలతో పూర్తి కమర్షియల్ హంగులతో ఉంటుంది. ప్రేక్షకుల్లో ఆయన సినిమాలపై విపరీతమైన క్రేజ్ పెరగడానికి ప్రధాన కారణంగా ఈ తరహా సినిమాలే. తనదైన స్టైల్, మేనరిజం, డైలాగ్ డెలివరీతో చిరంజీవి తెలుగు సినిమా రంగాన్ని కొన్నాళ్ల పాటు ఏలారు.

చాలా లాంగ్ గ్యాప్ తర్వాత చిరంజీవి మళ్లీ తన 150వ సినిమా ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. 2007లో శంకర్ దాదా జిందాబాద్ తర్వాత ఇప్పుడు మళ్లీ తొమ్మిదేళ్లకు చిరు చేయబోతున్న సినిమాకి అన్నీ కుదిరాయి. ఆయన 150 సినిమా 'కత్తిలాంటోడు' మూవీ షూటింగ్ ని ఈ నెల 15 నుంచి ప్రారంభించబోతున్నారు.

ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ తో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ యాక్షన్ సీన్ గ్రూఫ్ ఆఫ్ ఫైటర్స్ తో ప్లాన్ చేసారు. హైదరాబాద్ లోనే ఈ షూటింగ్ ప్రారంభం కానుంది. వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమాను అభిమానులకు అందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన 'కత్తి' చిత్రానికి రీమేక్ గా వివి వినాయక్ దర్శకత్వంలో ఈచిత్రం తెరకెక్కుతోంది.

 Chiranjeevi's 150 th film to begin with a action episode

ఈ సినిమా స్టోరీపై కొన్ని రోజులుగా వివాదం ఉన్న సంగతి తెలిసిందే. తమిళ 'కత్తి' చిత్రం స్టోరీ తనదే అంటే ఎం.నరసింహారావు అనే రచయిత చాలా కాలంగా పోరాటం చేస్తున్నారు. ఇపుడు అదే కథను తెలుగులో చిరంజీవి రీమేక్ చేస్తుండంతో వివాదం మరింత హైప్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ జరగనిచ్చేది లేదంటూ గతంలో ఆయన ఆందోళన కూడా చేసాడు. ఈ స్టోరీపై ఆయన రైటర్స్ అసోసియేషన్లో పిర్యాదు కూడా చేసారు.

150వ సినిమా ప్రారంభోత్సవానికి నరసింహరావును ఆహ్వానించక పోవడంతో ఆయన కోర్టుకు వెళ్లేందుకు సైతం సిద్ధమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా పోస్టర్స్, టైటిల్స్ లో తనకూ క్రెడిట్ ఇవ్వాలని, రచయితగా తన పేరు వేయాలని, దీంతో పాటు తనకు రెమ్యూనరేషన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసారు. ఈ వివాదాన్ని పెద్దగా చేయడం ఇష్టంలేక ఆయన కోరినట్లుగా చేసేందుకు చిరంజీవి అంగీకరించినట్లు సమాచారం.

సౌత్ లో టాప్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు చిరంజీవిని తన కెమెరా ద్వారా మరింత స్టైలిష్ గా చూపించబోతున్నారు. టాలీవుడ్లో ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న దేవి శ్రీ ప్రసాద్ ఈచిత్రానికి సంగీతం అందించనున్నారు. చిరంజీవి గత చిత్రాలు శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాలకు దేవిశ్రీ విజయవంతమైన సంగీతం అందించారు.

English summary
Chiranjeevi's 150 th film will begin the shooting with an action episode and director VV Vinayak is busy preparing everything for it. The action scene involving a group of fighters will be shot in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu