చిరంజీవి కత్తిలాంటోడు కాదు..కొత్త టైటిల్ ఇదే ..రేపే ప్రకటన
హైదరాబాద్ : చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. వినాయక్ దర్శకుడుగా,... రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కత్తిలాంటోడు టైటిల్ ప్రచారంలో వున్న విషయం తెలిసిందే.
తాజాగా ఈ సినిమాకు ఖైదీ నంబర్ 150 అనే టైటిల్‌ని ఫైనల్ చేసినట్లు సమాచారం. చిరంజీవి నటించిన ఖైదీ, ఖైదీనంబర్ 786 సక్సెస్ కావడంతో తాజా సినిమాకు ఖైదీ నంబర్ 150 అని టైటిల్ పెడితే బాగుంటుందని రామ్‌చరణ్ భావించే ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్తున్నారు.

ఇది చిరంజీవి 150వ చిత్రం కావడం, దానికి తోడు చిరుకి 'ఖైదీ' సెంటిమెంట్ ఉంది. ఆయన నటించిన 'ఖైదీ', 'ఖైదీ నెం.786' చిత్రాలు ఘనవిజయం సాధించాయి. అందుకే ఈ చిత్రానికి 'ఖైదీ నెం.150', అనే పేరు పెట్టే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అయితే వీటిపై చిత్ర యూనిట్ స్పందించలేదు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా సినిమా పేరు అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి.
షూటింగ్ విషయానికి వస్తే...ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. చిరంజీవి, కొంతమంది ఫైటర్ల మధ్య విశ్రాంతికి ముందొచ్చే ఫైట్ సీన్ ని తెరకెక్కిస్తున్నారు. వీటికి రామ్‌లక్ష్మణ్ నేతృత్వం వహిస్తున్నారు.
గత నెలలో మొదలైన చిరు 150వ చిత్రం ఏకధాటిగా షూటింగ్ జరుపుకొంటోంది. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. ఈ నెల 22న చిరు పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమా పేరేంటో ఆ రోజే వెల్లడించే అవకాశాలున్నాయి.


Click it and Unblock the Notifications











