»   » చిరంజీవి 150 టీజర్ (వీడియో), చరణ్ మోసం చేసాడా?

చిరంజీవి 150 టీజర్ (వీడియో), చరణ్ మోసం చేసాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : చిరంజీవి అబిమానులు మాత్రమే యావత్ సినీ ప్రపచం, సినీ లవర్స్ ఎదురుచూస్తున్న చిత్రం మెగాస్టార్ రీ ఎంట్రీ చిత్రం. చిరంజీవి 150వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

అందుకు తగ్గట్టుగా సినిమా మీద ఆసక్తి పెంచేలా సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో రోజుకో అప్ డేట్ తో ఊరిస్తున్నాడు నిర్మాత రామ్ చరణ్. అంతేకాదు మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా చిరు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తామంటూ ప్రకటించాడు చరణ్. అందుకు ప్రిపరేషన్ గా ముందుగా టీజర్ లాంటి చిన్న వీడియోని విడుదల చేసారు. మీరు ఇక్కడ ఆ వీడియోని చూడవచ్చు.

అయితే చిరు 150 ఫస్ట్ లుక్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూసిన అభిమానులకు ఈ టీజర్ కాస్త నిరాశనే మిగిల్చిందనే చెప్పాలి. బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ టీజర్ లో టెక్నీషయన్స్ ను పరిచయం చేసిన యూనిట్, చిరంజీవిని మాత్రం షాడో షాట్స్ తో చూపించాడు.

కేవలం టీజర్ లో ఎక్కడ చిరు ముఖాన్ని స్పష్టంగా చూపించకుండా కేవలం స్టైల్స్ తో అలరించే ప్రయత్నం చేశాడు. టీజర్ చూడటానికి సూపర్ గా ఉందని టాక్ తెచ్చుకున్నా, చిరు ...చిరు మాత్రమే కనపడటం మాత్రం అభిమానులకు నిరాశే. దాంతో రామ్ చరణ్ మోసం చేసాడంటూ మీడియా వర్గాలు కథనాలు సైతం రాసేస్తున్నాయి.

అంతేకాదు ఈ టీజర్ లో ఇప్పటికే ఫైనల్ అయినట్టుగా చెపుతున్న ఖైదీ నెం. 150 అనే టైటిల్ ను కూడా జోడించకపోవటం కూడా వారి ఆశలపై నీళ్లు జల్లినట్లైంది. అయితే మరికొద్ది సేపట్లో ఫస్ట్ లుక్ వచ్చేస్తుంది కాబట్టి అసలు నిరాశపడే ప్రశ్నేలేదు అంటున్నారు మరి కొందరు మెగాభిమానులు.

ఇది చిరంజీవి 150వ చిత్రం కావడం, దానికి తోడు చిరుకి 'ఖైదీ' సెంటిమెంట్‌ ఉంది. ఆయన నటించిన 'ఖైదీ', 'ఖైదీ నెం.786' చిత్రాలు ఘనవిజయం సాధించాయి. అందుకే ఈ చిత్రానికి 'ఖైదీ నెం.150', అనే పేరు పెట్టి ప్రకటన చేసారు.

షూటింగ్ విషయానికి వస్తే...ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. చిరంజీవి, కొంతమంది ఫైటర్ల మధ్య విశ్రాంతికి ముందొచ్చే ఫైట్ సీన్ ని తెరకెక్కిస్తున్నారు. వీటికి రామ్‌లక్ష్మణ్‌ నేతృత్వం వహిస్తున్నారు.

గత నెలలో మొదలైన చిరు 150వ చిత్రం ఏకధాటిగా షూటింగ్‌ జరుపుకొంటోంది. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది.

English summary
A special video wishing Megastar Chiranjeevi A Very Happy Birthday. Konidela Production Company's first outing Khaidi No:150 stars Megastar Chiranjeevi and Kajal Aggarwal in lead. Directed by V V Vinayak, Ram Charan turns producer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu