»   » చిరంజీవిని.... పూరి అనవసరంగా బ్లేమ్ చేసాడా?

చిరంజీవిని.... పూరి అనవసరంగా బ్లేమ్ చేసాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిరంజీవితో 150వ సినిమా రద్దు కావడంపై పూరి జగన్నాథ్ స్పందిస్తూ....కథ రెడీ చేసుకొని ఆయనకు చెప్పాను. ఫస్ట్ హాఫ్ విని చాలా బావుందన్నారు. ఫుల్ స్క్రిప్ట్ విన్న తరువాత నేను కబురు చేస్తానని చెప్పారు. కాని మీడియా ముందు సెకండ్ హాఫ్ నచ్చలేదు. అందుకే పూరితో సినిమా చేయట్లేదని చెప్పారు. ఒకవేళ ఆయన నాతో చెప్పి ఉంటే మార్పులు చేసి మరోసారి వినిపించేవాడ్ని. కాని చిరంజీవి గారు మాత్రం అలా చేయలేదని వ్యాఖ్యానించారు. అయితే పూరి చేసిన వ్యాఖ్యలపై ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు.

ఆటో జానీ కథ సెకండాఫ్ వినిపించిన తర్వాత చిరంజీవి నా అభిప్రాయం తర్వాత చెబుతా అని స్పష్టం చేసారు. ఒక వేళ కథ నచ్చితే చిరంజీవి వెంటనే ఒకే చెప్పేవారు. పూరి ఈ విషయం అర్థం చేసుకుని మళ్లీ స్క్రిప్ట్ వర్క్ చేసి చిరంజీవి దగ్గరకి వెళ్లి ఉండవచ్చు. కానీ పూరి అలా చేయలేదు. చిరంజీవి కోసం కథలో మళ్లీ మార్పులు చేయడం, మళ్లీ స్క్రిప్టు వర్క్ చేసి టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదని భావించాడో ఏమో తెలియదు కానీ...వెంటనే మహేష్ తో ఓ కథ ఓకే అయ్యిందని, నితిన్ మరో సినిమా అంటూ పూరి ట్వీట్ చేసారంటూమెగా అభిమానులు ఆరోపిస్తున్నారు. నిజంగా చిరంజీవి 150 సినిమా చేయాలని పూరికి పట్టుదల ఉంటే సెకండాఫ్ మీద సమయం వెచ్చించాల్సింది అని అంటున్నారు.

Chiranjeevi's 150th movie issues

ఈ పరిణామాలను పరిశీలిస్తే.... చిరంజీవి, పూరి మధ్య స్క్రిప్టు విషయంలో విబేధాలు వచ్చాయని స్పష్టమవుతోంది. అసలు స్క్రిప్టు ఫైనల్ చేయక ముందే చిరంజీవి 150వ సినిమాకు పూరిని దర్శకుడిగా ప్రకటించడం మెగా క్యాంప్ చేసిన అతి పెద్ద మిస్టేక్. వాస్తవానికి హీరోలు స్క్రిప్టులు తిరస్కరించడం అనేది సినిమా ఇండస్ట్రీలో సర్వ సాధారణమైన విషయమే. అయితే మీడియాలో అఫీషియల్ గా దర్శకుడిని అనౌన్స్ మెంట్ చేసిన తర్వాత చిరంజీవి మనసు మార్చుకోవడంతో ఈ గందరగోళం నెలకొంది.

English summary
Director Puri Jagannath has confirmed that Megastar Chiranjeevi has ditched him with respect to his (Chiranjeevi's) 150th movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu