»   » అన్నయ్య, చరణ్ అన్నదమ్ముల్లా ఉన్నారని నాగబాబు, కాలేజీ రోజుల్లో రోడ్లపై తిరిగేవాళ్లం: రానా

అన్నయ్య, చరణ్ అన్నదమ్ముల్లా ఉన్నారని నాగబాబు, కాలేజీ రోజుల్లో రోడ్లపై తిరిగేవాళ్లం: రానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్ తేజ హీరోగా నటించిన ధృవ ప్రీ రిలీజింగ్ ఫంక్షన్‌లో ఆయన బాబాయ్ నాగబాబు కూడా మాట్లాడారు. ఆ ఫంక్షన్ హైదరాబాదులో ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్‌తో పాటు పలువురు మాట్లాడారు.

రామ్ చరణ్ తేజ హీరోగా నటించిన ద్రువ సినిమా ప్రీ రిలీజింగ్ పంక్షన్‌లో ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస రావుతో పాటు తెలంగాణ మంత్రులు కెటి రామారావు, తలసాని శ్రీనివాస యాదవ్ పాల్గొన్నారు. ఈ ఫంక్షన్‌లో తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామారావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.


Photos : చెర్రీ ధృవ పంక్షన్‌లో కెటిఆర్, గంటా


ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస రావు, తెలంగాణ మంత్రి కెటి రామారావు వేదికను పంచుకోవడం ధృవ సినిమా ఫంక్షన్ విశేషం. ఇరువురి మధ్య స్నేహపూర్వకమైన వ్యాఖ్యలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ కార్యక్రమంలో నాగబాబు మాట్లాడారు.


నాగబాబు ఏమన్నారంటే..

నాగబాబు ఏమన్నారంటే..

‘అన్నయ్య మరో సినిమా చేస్తే చూడాలని కోరుకొనేవారిలో నేను మొదటివాణ్ని. ‘ఖైదీ నంబర్‌ 150' కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. పోస్టర్‌లు చూస్తుంటే చరణ్‌ లుక్‌కీ.. అన్నయ్య లుక్‌కీ తేడా కనిపించడం లేదు. ఇద్దరూ బ్రదర్స్‌లా ఉన్నారు' అని నాగబాబు అన్నారు.


ఆ రోజుల్లో కలిసి తిరిగేవాళ్లం...

ఆ రోజుల్లో కలిసి తిరిగేవాళ్లం...

‘నేనూ, చరణ్‌ కాలేజీ రోజుల్లో కలిసి తిరిగేవాళ్లం. కాలేజీలో కంటే రోడ్లపైనే ఎక్కువ కనిపించేవాళ్లం. నాకు నచ్చిన వ్యక్తులంతా ఒకే సినిమాలో ఉన్నారు. అందుకే పెద్ద పెద్ద రికార్డులు సాధించాలి' అని రానా అన్నాడు.


గర్వంగా ఉందని రకుల్ ప్రీత్ సింగ్

గర్వంగా ఉందని రకుల్ ప్రీత్ సింగ్

‘ఇంత మంచి స్క్రిప్టులో నేనూ భాగస్వామిని అయినందుకు సంతోషంగా ఉంది. చరణ్‌ నా అభిమాన నటుడు. ఆయనకు మంచి మనసుంది. ‘ధృవ' కోసం చాలా కష్టపడ్డారు. చరణ్‌ ఇలాంటి కథ ఎంచుకోవడం గర్వంగా ఉంది' అని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు.


రెగ్యులర్ సినిమా కాదని దర్శకుడు

రెగ్యులర్ సినిమా కాదని దర్శకుడు

‘ఇది రెగ్యులర్‌ సినిమా కాదు. కొత్తగా ఉంటుంది. చరణ్‌ ఇష్టపడి.. తాను కొత్తగా చేయాలన్న ఉద్దేశంతో ఈ కథని ఎంచుకొన్నాడు. అంకితభావంతో పనిచేశాడు. ఈ సినిమాతో చరణ్‌లాంటి మంచి స్నేహితుడు దొరికాడని గర్వంగా చెప్పుకొంటాను. ఈ నిర్మాతలు లేకపోతే సినిమా ఇంత బాగా వచ్చేది కాదు'అని చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి అన్నారు.


వారంతా కార్యక్రమంలో ఇలా...

వారంతా కార్యక్రమంలో ఇలా...

ధృవ సినిమా ప్రీ రిలీజింగ్ ఫంక్షన్‌లో తెలంగాణ రాష్ట్ర మంత్రులు కెటి రామారావు, తలసాని శ్రీనివాసయాదవ్‌, దిల్‌రాజు, చంద్రబోస్‌, సుకుమార్‌, బోయపాటి శ్రీను, పరశురామ్‌, మారుతి, నాగబాబు, పోసాని కృష్ణమురళి, హిప్‌ ఆప్‌ తమిళ, నవదీప్‌, ఎన్వీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


English summary
Chiranjeevi's brother and actor Nagababu said that Ram Charan is like brother of Chiranjeevi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu