»   » దటీజ్ మెగాస్టార్! ఉయ్యాలవాడపై చిరంజీవి అనూహ్య నిర్ణయం.. అదేమిటంటే..

దటీజ్ మెగాస్టార్! ఉయ్యాలవాడపై చిరంజీవి అనూహ్య నిర్ణయం.. అదేమిటంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకొనున్న ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి చిత్ర ప్రారంభోత్సవ తేదీని ఫిక్స్ చేసినట్టు సమాచారం అందుతున్నది. ముందుగా అనుకొన్న ప్రకారం చిరంజీవి బర్త్‌డే రోజున కాకుండా దానికంటే ముందే ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. షూటింగ్ ప్రారంభమైన తర్వాత నిరవధికంగా చిత్రీకరణ జరిపే విధంగా చర్యలు తీసుకొన్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

జాతీయస్థాయి చిత్రంగా ఉయ్యాలవాడ

జాతీయస్థాయి చిత్రంగా ఉయ్యాలవాడ

పదేళ్ల గ్యాప్‌ తర్వాత మళ్లీ ఖైదీ నంబర్ 150 చిత్రంతో చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం అద్బుతమైన కలెక్షన్లను సాధించింది. ఆ తర్వాత స్వాతంత్ర్య సమరయోధుడు చిత్ర కథతో మెగాస్టార్ సిద్దమవుతున్నాడు. ఈ చిత్రానికి నిర్మాతగా తనయుడు రాంచరణ్ వ్యవహరిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జాతీయ స్థాయి చిత్రంగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఆగస్టు 15న ముహూర్తం ఖరారు?

ఆగస్టు 15న ముహూర్తం ఖరారు?

18వ శతాబ్దానికి సంబంధించిన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తన జన్మదినం ఆగస్టు 22న కాకుండా ఆగస్టు 15న ప్రారంభించాలని చిరంజీవి భావిస్తున్నారట. ఓ పోరాట యోధుడి జీవితంపై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పంద్రాగస్టు రోజున అయితే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి కోసం కొణిదెల ప్రొడక్షన్స్ ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం.

నిరవధికంగా ఉత్తర భారతంలో షూటింగ్

నిరవధికంగా ఉత్తర భారతంలో షూటింగ్

మెగా క్యాంపులో రేసుగుర్రం ధ్రువ లాంటి హిట్లను అందించిన ఘనత కలిగిన సురేందర్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం ఉత్తర భారత దేశంలో జరిపే అవకాశం ఉంది. లాంచ్ తర్వాత రెగ్యులర్‌గా షూటింగ్ నిర్వహించి వచ్చే వేసవికి సినిమాను ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నం ఉన్నారు.

నయనతార కన్ఫర్మ్.. సోనాక్షి, ఐశ్వర్యలో ఒకరు..

నయనతార కన్ఫర్మ్.. సోనాక్షి, ఐశ్వర్యలో ఒకరు..

ఉయ్యాలవాడలో బాలీవుడ్ తారలు సోనాక్షి సిన్హా, ఐశ్వర్యరాయ్ నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా హీరోయిన్ ఎంపిక విషయంలో అనూహ్యమైన పరిణామం చోటుచేసుకొన్నది. చిరంజీవి పక్కన నయనతారను ఎంపిక చేసినట్టు మీడియాలో వార్తలు ప్రచారమవుతున్నాయి. అలాగే సోనాక్షి, ఐశ్వర్యలలో ఒకరిని తీసుకొనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. కాగా ఈ వార్తలకు సంబంధింంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

English summary
Megastar Chiraneevi's next movie is Uyyalawada Narsimhareddy. This movie is real story of 18th century freedom fighter Uyyalawada Narsimhareddy. As per reports this movie goes sets on August 15th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu