»   » రామ్ చరణ్ కంటే నేనే బెస్ట్ డాన్సర్

రామ్ చరణ్ కంటే నేనే బెస్ట్ డాన్సర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి త్వరలో రామ్ చరణ్ నటిస్తున్న ‘బ్రూస్ లీ-ది ఫైటర్' సినిమాలో అతిథి పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి తన కొడుకుతో ఉన్న రిలేషన్ షిప్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

మీ ఇద్దరిలో ఎవరు బెస్ట్ డాన్సర్ అనే ప్రశ్నకు చిరంజీవి స్పందిస్తూ... రామ్ చరణ్ కంటే నేను బెస్ట్ డాన్సర్ అని సమాధానం ఇచ్చారు. అంతే కాదు తామిద్దరం తండ్రీ కొడుకుల్లా కాకుండా స్నేహితుల్లా ఉంటామని చిరంజీవి చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ చిన్న తనం నుండి ఎంతో మెచ్యూర్డ్ అని, నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తే వెంటనే సరి చేసే వాడని చెప్పుకొచ్చారు. కొన్ని విషయాల్లో నాకు సలహాలు కూడా ఇస్తుండే వాడు అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

‘బ్రూస్ లీ-ది ఫైటర్' చిత్రానికి సంబంధించిన షూటింగ్ లో చిరంజీవి సెప్టెంబర్ 12 నుంచి పాల్గొనబోతున్నాడని తెలుస్తోంది. ఓ పాట సహా పలు కీలక సన్నివేశాల్ని మెగాస్టార్ పై చిత్రీకరించేందుకు దర్శకుడు శ్రీనువైట్ల సన్నాహాలు చేస్తున్నాడని వినిపిస్తోంది.

Chiranjeevi says, I am a better dancer than Ram Charan

అయితే ఈ చిత్రంలో నటించినందుకు గాను చిరంజీవి ఒక్క పైసా రెమ్యూనరేషన్ కూడా తీసుకోవడం లేదట. కొడుకు నటిస్తున్న సినిమా కోసం, అభిమానుల కోసం ఆయన ఫ్రీగా నటిస్తున్నారట. అయితే నిర్మాతలు మాత్రం ఆయనకు ఎంతో కొంత గౌరవ రెమ్యూనరేషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఆయన రూ. 5 కోట్లు తీసుకుంటున్నట్లు ప్రచారం జరిగినా అదంతా అవాస్తవమని తేల్చారు నిర్మాత దానయ్య.

చిరంజీవి ఈ సినిమాలో తన సొంత క్యారెక్టర్ నే పోషించడం విశేషం. అభిమానుల అంచనాలకి మించి చిరుని ఆన్ స్క్రీన్ ప్రెజెంట్ చేసేందుకు శ్రీను వైట్ల ప్లాన్ వేస్తున్నాడని టాక్. శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసి దసరా కానుకగా అక్టబర్ 16న బ్రూస్ లీ ని రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి థమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు.

English summary
In a latest interview given to a national news daily, Chirajeevi was asked who is a better dancer between him and Charan. “Obviously me,” prompt came the reply from the Megastar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu