For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మేనల్లుడుకి ‘గోలీమార్...’ ఇచ్చిన చిరంజీవి

  By Srikanya
  |

  హైదరాబాద్ : చిరంజీవి, రాధ కాంబినేషన్ లో రూపొంది సూపర్ హిట్టైన సాంగ్‌ ''గోలీమార్... కాష్మోరా కౌగిలిస్తే ఏం చేస్తావో''. ఈ పాటకు చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ స్టెప్స్ వేయనున్నాడు. ఈ పాట రీమిక్స్ వెర్షన్ ని 'రేయ్'లో వాడుతున్నారు.
  ఈ సెన్సేషనల్ హిట్ సాంగ్ లో చిరంజీవి, రాధ ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. ఆ పాటను ఇప్పుడు రీ-మిక్స్ చేసి 'రేయ్'లో పెడుతూండటంతో అంతటా క్రేజ్ క్రియేట్ అవుతోంది.

  సాయిధరమ్‌తేజ్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ఏడాదికి పైగా శ్రమించి, కోట్లాది రూపాయలతో తెరకెక్కిస్తున్నారు దర్సకుడు వైవియస్ చౌదరి. పాటలను చిత్రీకరించడంలో తన గురువు కె.రాఘవేంద్రరావును గుర్తుకు తెచ్చే చౌదరి ఈ పాటను ఏ రకంగా తెరెకెక్కిస్తారో అని అంతటా ఆసక్తి నెలకొంది. ఈ రీ-మిక్స్ సాంగ్‌ను సాయిధరమ్, శ్రద్ధాదాస్‌లపై శుక్రవారం నుంచి రాత్రి వేళ్లల్లో షూట్ చేస్తున్నారు. ట ఈ పాట. చాలా రిచ్‌గా ఉంటుందని చెప్తున్నారు. ఇలాంటి పాటలు 'రేయ్'లో ఒకదానిని మించి ఒకటి ఉంటాయని చౌదరి చెబుతున్నారు. మరో విషయం ఈ చిత్రానికి ఆయనే నిర్మాత కూడా. రాజు సుందరం ఈ పాటకు కొరియోగ్రఫీ అందిస్తున్నారు. 2013 సమ్మర్ లో ఈ చిత్రం విడుదల అయ్యే అవకాసం ఉంది.

  లాహిరి.. లాహిరి.. లాహిరిలో..., దేవదాసు, ఒక్కమగాడు, సలీమ్‌ చిత్రాల దర్శకుడు వైవియస్‌.చౌదరి హిట్ కోసం మొహం వాచి ఉన్నారు. 'రేయ్‌' తో తను మళ్లీ తన పాత స్ధానాన్ని చేరుకుంటానని భావిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ప్రముఖ నటుడు చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ హీరోగా పరిచయం అవుటం సినిమాపై ట్రేడ్ లో ఆసక్తి నెలకొంది. బొమ్మరిల్లు పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది.

  వైవియస్ చౌదరి ఈ చిత్రం గురించి మాట్లాడుతూ... 'నిర్మాతగా నాకు ఇది ఐదవ చిత్రం. ఒక సినిమా ఆఫీసు నుండి బయటకు వస్తుండగా, ఎదురుగా కొందరు యువకులు క్రికెట్‌ ఆడుతూ కనిపించారు. వారిలో చేతిలో బాల్‌ పట్టుకుని ఉన్న యువకుడు కనిపించాడు. ఆతడిలో సినిమా హీరో కాగల లక్షణాలు కనిపించాయి. సినిమాలో నటిస్తావా అని అడిగితే, అప్పటికే అతని కుటుంబసభ్యులు సినిమా ప్లాన్‌ చేస్తున్న విషయాన్ని చెప్పాడు. వివరాలు అడిగితే మెగాస్టార్‌ చిరంజీవికి మేనల్లుడిని అని చెప్పారు. చిరంజీవి సోదరి విజయ కుమారుడతను. పేరు సాయిధరమ్‌తేజ్‌.

  ఈ విషయం పవన్‌కల్యాణ్‌ దృష్టికి వెళ్లడంతో అతడి ఆహ్వానం మేరకు కలిశాను. ధరమ్‌తేజ్‌తో సినిమా ప్లాన్‌ చేస్తున్న విషయాన్ని పవన్‌ చెప్పారు. నా ప్రపోజల్‌ విన్నారు. బాగా నచ్చడంతో ఈ విషయాన్ని అన్నయ్య (చిరంజీవి) దృష్టికి తీసుకెళదాం అన్నారు. నాగబాబు ద్వారా చిరంజీవిని కలిశాను. ఆయన నా ప్రాజెక్ట్‌ గురించి విని అంగీకరించారు. ఆ విధంగా ఈ సినిమాకు ప్లాన్‌ జరిగింది' అని పేర్కొన్నారు. సినిమా కథాంశం గురించి చెబుతూ, 'ఆరేబియన్‌ దీవుల్లో స్థిరపడిన భారత సంతతికి చెందిన కొందరు యువకులు హీరోతో జట్టుగా 'రేయ్‌' అనే బ్యాండ్‌ స్థాపించి అమెరికా వెళతారు. ఇది మ్యూజికల్‌ ఎంటర్‌టైనర్‌ సినిమాగా ఉంటుంది అన్నారు. 'షౌట్ ఫర్ సక్సెస్' అన్నది ఈ సినిమాకి ట్యాగ్ లైన్ గా పెట్టారు.

  English summary
  The trend of remixing popular songs from Chiranjeevi’s career seems to be at an all time high these days. Now, it’s the turn of another hit track – ‘Golimar’ from Chiranjeevi, Radha starrer Donga to be remixed. The song has been remixed for Chiranjeevi’s nephew Sai Dharam Tej’s debut film Rey. Saiyami Kher and Shraddha Das are playing the lead roles opposite Sai Dharam Tej in this romantic entertainer. The remix of Golimar is currently being shot on Sai Dharam Tej and Shraddha Das in Hyderabad. Raju Sundaram is the choreographer for this song. YVS Chowdhary is directing and producing the film. Except for few songs and some patch work, most of the film’s shooting has been wrapped up. Rey is likely to hit the screens in early 2013.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X