»   » గాయమైనా రిమ్‘జిమ్’ అంటూ చిరంజీవి జోరు...!

గాయమైనా రిమ్‘జిమ్’ అంటూ చిరంజీవి జోరు...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి వయసు 60 దాటినా ఆయనలో ఉత్సాహం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. తన కుడిచేతి భుజానికి ఇటీవలే ఆపరేషన్ జరిగింది. ఇంకా ఆ ఆపరేషన్ తాలూకు గాయం, నొప్పి మానక ముందే చేతి కట్టుతోనే ఆయన ఉత్సాహంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ఇటీవల శ్రీజ పెళ్లి వేడుకలో భాగంగా చిరంజీవి రోకలి పట్టి పసుపు దంచే కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన హైదరాబాద్ లో ఓ జిమ్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిరంజీవి పర్సనల్ ట్రైనర్ ప్రవీణ్ మణికొండలో ఏర్పాటు చేసిన రాగాస్ ఫ్లెక్స్ జిమ్ ను చిరంజీవితో ఓపెన్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన జిమ్ లో కాసేపు వ్యాయామం చేసారు.

Chiranjeevi Spotted in Gym

పెళ్లి కార్యక్రమాల్లో చురుకుగా..
ప్రస్తుతం చిరంజీవి తన కూతురు పెళ్లి వేడుకలో చురుకుగా పాల్గొంటున్నారు. ఆయన కూతురు శ్రీజ వివాహం ఫిబ్రవరి 25న జరుగబోతున్నట్లు సమాచారం. ఈ పెళ్లిని పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. పెళ్లికి సంబంధించిన ఏ విషయం కూడా అఫీషియల్ గా బయటకు చెప్పడం లేదు మెగా ఫ్యామిలీ.

శ్రీజ పెళ్లాడే వ్యక్తి పేరు కళ్యాణ్. చిత్తూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త కిషన్ కుమారుడని టాక్. యూఎస్ఏలో బిజినెస్ మేన్ గా సెటిలైన ఎన్నారై. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే....శ్రీజ, కళ్యాణ్ క్లాస్‌మేట్స్ కూడా. తన గురించి అన్ని తెలిసిన కళ్యాణ్‌ను పెళ్లాడేందుకు శ్రీజ సముఖంగా ఉండటంతో ఇరు కుటుంబాల వారు పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది.

English summary
Chiranjeevi made it for his personal trainer G Praveen Reddy to open the latter's gym in the city. Chiru praised Praveen for equipping the gym with latest equipment.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu