»   » మెగాస్టార్ ‘చిరు’ కాన్సెప్ట్ ను ఫాలోఅవుతున్న అభిషేక్ బచ్చన్!

మెగాస్టార్ ‘చిరు’ కాన్సెప్ట్ ను ఫాలోఅవుతున్న అభిషేక్ బచ్చన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

'మీ అభిమాన హీరో ఎవరూ? అని టాలీవుడ్ లో ఏ హీరో, హీరోయిన్ ని అడిగినా, ఇష్టముంటే తమ కుటుంబానికి చెందిన సీనియర్ హీరో, అదీ ఇష్టం లేకపోతే ఏ బాలీవుడ్ హీరో పేరునో, హాలీవుడ్ హీరో పేరునో చెప్తుంటారు. బాలీవుడ్ జనం మాత్రం హాలీవుడ్ తప్ప బాలీవుడ్ గానీ, దక్షిణాదికి చెందిన హీరో పేరుగానీ చెప్పడం అసలు ఇప్పటి వరకూ ఎవరినోట వినలేదు.

మరి ఇప్పుడు అభిషేక్ బచ్చన్ మాత్రం తన అభిమాన హీరో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అంటూ ఇంటర్నెట్ లోని 'ట్విట్టర్" లో రాసుకున్నాడు. తాను అభిమానించే అభిమాన నటుడు చిరంజీవి అని రాసుకున్నాడట. ఇక, చిరంజీవి పలు సందర్భాల్లో తన అభిమాన నటుడు అమితాబ్ బచ్చన్ అంటూ చాలా సందర్భాల్లో ప్రస్తావించిన సంగతి అందరికీ గుర్తుండే వుంటుంది.

మరి ఇందంతా ఇప్పుడెందుకు అంటారా? ఈ నెల 27 వరల్డ్ ఎర్త్ అవర్ పేరిట గంటపాటు కరెంట్ ను వినియోగించొద్దంటూ అభిషెక్ బచ్చన్ కోరుతున్నాడు. తన అభిమాన నటుడు చిరంజీవి నటించిన 'స్టాలిన్" లో 'ఒకరు ఇంకో ముగ్గురికి సహాయం చేయాలనీ..ఆ ముగ్గురూ ఒక్కొక్కరూ ఇంకో ముగ్గురికి సహాయం చేయాలనే(ఏవిధమైన ప్రతిఫలాన్ని ఆశించకుండా) కాన్సెప్ట్ నే 'వరల్డ్ ఎర్త్ అవర్" కోసం పాటించాలని అభిషేక్ బచ్చన్ తన అభిమానులకు సూచిస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా జరగనున్న ఈ కార్యక్రమానికి మన దేశం తరపున అభిషేక్ పబ్లిసిటీ ఇవ్వడం విశేషంగా వుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu