»   » 'చంద్రముఖి' ఆట కట్టించడానికి సిద్ధమవుతున్న 'చిరంజీవి'..??

'చంద్రముఖి' ఆట కట్టించడానికి సిద్ధమవుతున్న 'చిరంజీవి'..??

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు, తమిళ భాషల్లో రజనీకాంత్ కథానాయకుడిగా సూపర్ హిట్ చిత్రం చంద్రముఖి సినిమా తొలుత కన్నడలో ఆప్తమిత్రగా విడుదలయి సూపర్ హిట్ అయింది. ప్రముఖ నటి సౌందర్య నటించిన చివరి చిత్రం ఇదే కావడం విశేషం, అలాగే ఈ సినిమాకు సీక్వెల్ గా దర్శకుడు పి వాసు ఆప్తరక్షక చిత్రాన్ని తీసారు. ఈ సినిమా కన్నడలో రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన కథానాయకుడు విష్ణువర్ధన్ నటించిన చివరి చిత్రం ఇదే కావడం విశేషం. ఆప్తమిత్ర, ఆప్తరక్షక ఈ రెండు చిత్రాల్లో ముఖ్య భూమికలు పోషించిన సౌందర్య, విష్ణువర్ధన్ లు సినిమా విడుదలకు సరిగ్గా నెలరోజుల ముందు అకస్మాత్తుగా దుర్మరణం చెందడంతో చంద్రముఖిలో నటించిన రజనీకాంత్ ఈ సినిమా సీక్వెల్ ను చెయ్యడానికి వెనకాడుతున్నట్టు సమాచారం. దీంతో ఈ సినిమా దర్శకుడు పి వాసు ఈ సినిమాను మరో స్టార్ హీరోతో చేయించడానికి సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం.

ఇక సినీవినీలాకాశంలో తిరుగులేని మెగాస్టార్ గా ఎదిగి, రాజకీయాల్లో విఫలమైన చిరంజీవి తిరిగి సినిమాల్లో నటించేందుకు ఆశక్తి చూపుతున్న తరుణంలో ఆప్తరక్షక సినిమాను తెలుగులో చిరంజీవి చేత చేయించడానికి దర్శకుడు వాసు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. చిరు కూడా ఈ సినిమాకు చెయ్యడానికి సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. సినీవర్గాల సమాచారం నిజమయితే త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. మరి మెగాస్టార్ కు ధీటుగా చంద్రముఖిగా ఈ సినిమాలో ఏ తార నటించనుందో మరి..!?

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X