Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'సైరా' ఇన్‌సైడ్ టాక్: ఇదీ జరుగుతోంది.. అందుకే చిరంజీవి ఆ లుక్?..
'సైరా' ప్రాజెక్టు మొదలైందో లేదో.. దాని చుట్టూ అనేక పుకార్లు షికారు చేస్తూ వస్తున్నాయి. మొదటి షెడ్యూల్‌పై చిరంజీవి పెదవి విరిచారని, ఏకంగా డైరెక్టర్‌ను మార్చడానికే ప్రయత్నిస్తున్నారని రకరకాల ఊహాగానాలు తెర పైకి వచ్చాయి. అయితే అవన్నీ గాలి వార్తలే తప్ప అందులో నిజం లేదనేది ఇన్‌సైడ్ టాక్..

సెకండ్ షెడ్యూల్:
మొదటి షెడ్యూల్‌లో దర్శకుడు సురేందర్ రెడ్డి పనితీరు, షూటింగ్ రషెస్ సరిగా రాలేదన్న వార్త అవాస్తవమని తెలుస్తోంది. డైరెక్టర్‌ను మార్చే ప్రసక్తే లేదని, ఇప్పటికే రెండో షెడ్యూల్ కోసం అంతా సిద్దం చేసుకున్నారని సమాచారం.

కొత్త లుక్:
రెండో షెడ్యూల్ కోసం చిరంజీవి పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించబోతున్నారని టాక్. అందుకే మీసాలను కూడా తీసేశారని అంటున్నారు. ఇటీవల మీసాలు లేని లుక్‌లో చిరంజీవి మీడియా ముందుకు రావడం దీనికి ఊతమిచ్చింది.


ఫిబ్రవరి 20 నుంచి..:
సైరా సినిమాలో పాత్ర కోసమే చిరంజీవి పూర్తిగా మీసాలు తీసేశారని తెలుస్తోంది. ఫిబ్రవరి 20 నుంచి చేయబోయే రెండో షెడ్యూల్ షూట్ కోసం ఇప్పటికే అన్నీ సిద్దం చేసుకున్నారని టాక్. హైదరాబాద్ లోని స్టూడియోలో వేసిన కొన్ని సెట్స్ తో పాటు, తమిళనాడులోని పొలాచ్చిలో కూడా కొన్ని రోజులు షూటింగ్ చేయనున్నారు.

నయనతార-చిరు సీన్స్ పిక్చరైజేషన్..:
ఇక సినిమా నుంచి నయనతార కూడా తప్పుకోవచ్చనే వార్తల్లోనూ నిజం లేదని తెలుస్తోంది. రెండో షెడ్యూల్ లో చిరంజీవితో పాటు నయనతార జాయిన్ అవుతున్నారనేది లేటెస్ట్ టాక్. మెగాస్టార్-నయనతార కాంబినేషన్ లో పలు సన్నివేశాలను రెండో షెడ్యూల్ లో తెరకెక్కిస్తారని సమాచారం. కాగా, 2019 ప్రారంభంలో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.