»   » ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సెట్లో చిరంజీవి (ఫోటోస్)

‘సర్దార్ గబ్బర్ సింగ్’ సెట్లో చిరంజీవి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్' సెట్స్ సందర్శించారు. షూటింగ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిరంజీవి సర్దార్ సెట్స్ సందర్శనతో అన్నదమ్ముల మధ్య ఎలాంటి విబేధాలు లేవని తేలి పోయింది. తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలను చిత్ర యూనిట్ సభ్యులు ట్విట్టర్లో షేర్ చేసారు.

సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన భారీ సెట్లో శర వేగంగా జరుగుతోంది. ఈ చిత్రం ఆడియో విడుదల వేడుకలను మార్చి 12న నిర్వహించనున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు.

2012లో విడుదలైన ‘గబ్బర్‌సింగ్‌' సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ సరసన కాజల్‌ నటిస్తున్నారు. ఈ చిత్రంలో రాయ్‌ లక్ష్మి ఒక ప్రత్యేక గీతంలో ఆడిపాడారు. ఏప్రిల్‌లో ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు

ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మాత. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. కళ: బ్రహ్మ కడలి, కూర్పు: గౌతంరాజు, పోరాటాలు: రామ్‌ లక్ష్మణ్‌, కెమెరా: జయనన్‌ విన్సెంట్‌. స్లైడ్ షోలో చిరంజీవికి సంబంధించిన ఫోటోస్..

చిరంజీవి

చిరంజీవి

సర్దార్ గబ్బర్ సింగ్ సెట్స్ ను సందర్శించిన సందర్భంగా చిరంజీవి వారితో కలిసి ఫోటో దిగారు.

సర్దార్

సర్దార్

సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు చిరు.

విబేధాలు లేవు

విబేధాలు లేవు

చిరంజీవి సర్దార్ సెట్స్ సందర్శనతో అన్నదమ్ముల మధ్య ఎలాంటి విబేధాలు లేవని తేలి పోయింది.

సంక్రాంతి టీజర్

సర్దార్ గబ్బర్ సింగ్ సంక్రాంతి టీజర్

‘సర్దార్ గబ్బర్ సింగ్’ సెట్లో చిరంజీవి (ఫోటోస్)

‘సర్దార్ గబ్బర్ సింగ్’ సెట్లో చిరంజీవి (ఫోటోస్)

‘సర్దార్ గబ్బర్ సింగ్' సెట్లో చిరంజీవి (ఫోటోస్)

English summary
Megastar Chiranjeevi visited the sets of Pawan Kalyan’s Sardaar Gabbar Singh.
Please Wait while comments are loading...