»   » అల్లు అర్జున్ 'వరుడు' లో చిరంజీవి ఏం చేస్తారంటే..

అల్లు అర్జున్ 'వరుడు' లో చిరంజీవి ఏం చేస్తారంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్, గుణశేఖర్ కాంబినేషన్లో రెడీ అయిన వరుడు చిత్రంలో చిరంజీవి కూడా పాలుపంచుకోనున్నారు. అయితే ఆయన నటుడుగా కాకుండా కేవలం తన వాయిస్ ద్వారా మాత్రమే ఈ చిత్రంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. జల్సా చిత్రానికి మహేష్ బాబు వాయిస్ ఓవర్ నేరేషన్ చెప్పినట్లు చిరంజీవి ...తన మేనల్లుడు వరుడు చిత్రానికి వాయిస్ అందిస్తున్నారు. ఈ మేరకు ఆయన తను చెప్పవలిసిన మ్యాటర్ ని ప్రాక్టీస్ చేసారు. అయితే క్రేజ్ కోసం చిరంజీవిని అడగలేదని చిత్రం కథ ప్రకారం వాయస్ ఓవర్ తప్పనిసరి అనీ, ఎవరు చెప్తారా అని రకరకాలుగా ఆలోచించిన పిమ్మట ఆ ఎంపిక చేసామని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. ఇక రికార్డింగ్ ధియోటర్ కి వచ్చి వాయస్ ఓవర్ చెప్పిన చిరంజీవి కూడా చాలా హ్యాపీగా ఉన్నట్లు చెప్తున్నారు. ఇక అల్లు అర్జున్ తన మామయ్యను రిక్వెస్ట్ చెయ్యబట్టే ఆయన రాజకీయాలనుంచి కాస్త ప్రక్కకు వచ్చి ఈ ప్రయత్నం చేసాడంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu