»   » ‘మగధీర’కు గోల్డెన్ లెగ్ అయిన చిరు ‘వరుడు’ కి ఏమౌతాడు??

‘మగధీర’కు గోల్డెన్ లెగ్ అయిన చిరు ‘వరుడు’ కి ఏమౌతాడు??

Posted By:
Subscribe to Filmibeat Telugu

'వరుడు" లో మెగాస్టార్ చిరంజీవి..అనగానే ఈ సినిమాలో చిరు నటిస్తున్నాడా అనే ప్రశ్నలు మొదలవుతాయి. ఎందుకంటే మగధీరలో మెగాస్టార్ లెగ్ పెట్టారు అందుకే మగధీర బ్లాక్ బస్టర్ అయింది. అందుకే కాబోలు వరుడు లో వాయిస్ వుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజం అయితే యూనివర్సల్ మీడియా బ్యానర్ లో గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతోన్నచిత్రం 'వరుడు" సూపర్ హిట్టే అంటున్నారు. అటు చిరు ఫ్యాన్స్ ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్.

అయితే ఈ సినిమాలో కొన్ని క్షణాలు చిరంజీవి వాయిస్ వినబడుతుందని, ఈ వాయిస్ ఎందుకిచ్చారో ఏంటో ఇంకా తెలియలేదు కానీ..సినిమా ప్రారంభం కాగానే చిరు వాయిస్ వినబడుతుందని సమాచారమ్. మరి కేవలం మాటలేన లేక 'మగధీర"లో లాగా చిరు నటన కూడా తెరపై కనిపించనున్నారో తెలియాల్సివుంది. మరి ఈ సినిమా మార్చి 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అంతవరకూ వేచి చూడాల్సిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu