twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా

    By Staff
    |

    అవీ కూడా ఆయనకి పేరుతెచ్చినప్పటికీ, విజయం మాత్రంవరించలేదు. సున్నితమైన హాస్యం,జీవితాన్ని లైట్‌గా తీసుకోవాలనేతరహా ఫిల్మ్‌మేకింగ్‌ వల్లేతనకు పేరు వచ్చిందన్న సత్యాన్నిఆరేళ్ళ తర్వాత గ్రహించిన నగేష్‌తిరిగి తన హైదరాబాద్‌ బ్లూస్‌చిత్రానికి సీక్వెల్‌ రూపొందించాడు.హైదరాబాద్‌ బ్లూస్‌ - 2అనే ఈ చిత్రం జూలై రెండునభారతదేశమంతా విడుదలఅవుతోంది. ఈ నేపథ్యంలో ఆయనథట్స్‌తెలుగు.కామ్‌ ప్రతినిధితోహైదరాబాద్‌లోని వెస్ట్‌సైడ్‌కాంప్లెక్స్‌ ఆవరణలో మాట్లాడారు.ఇంటర్వ్యూ విశేషాలు..

    సాధారణంసీక్వెల్‌ చిత్రాలను వెనువంటనేరూపొందిస్తారు. కానీ, ఆరేళ్ళ తర్వాతహైదరాబాద్‌ బ్లూస్‌ చిత్రానికిసీక్వెల్‌ను రూపొందిస్తున్నారు మీరు.ఇంత గ్యాప్‌కు కారణం ఏమిటి?
    నా తొలి చిత్రం ఒక కసితో, నన్ను నేనునిరూపించుకునేందుకు తీసినది.నాకు అంతకుముందు నిర్మాణంలో అనుభవం లేదు. అంతగాడబ్బు కూడానూ లేదు. అయితే,అదృష్టవశాత్తూ,హైదరాబాద్‌ బ్లూస్‌విజయవంతం కావడంతోదర్శకుడిగా మరిన్ని ప్రయోగాలుచేశాను. తీన్‌ దీవారే చిత్రంతీస్తున్నప్పుడు, ఫ్రెండ్స్‌తోమాట్లాడుతుండగా ఈ సీక్వెల్‌ ఆలోచనవచ్చింది. హైదరాబాద్‌ బ్లూస్‌చిత్రంలోని వరుణ్‌, అశ్వినీ ఇప్పుడేంచేస్తున్నారు, వారు పెళ్ళి చేసుకొని ఉంటేవారి జీవితం ఎలా ఉంటుంది? అనే ఆలోచనరావడంతో ఈ కథరూపొందించడం ప్రారంభించాను.

    పో,,బ్యాక్‌ టు బేసిక్స్‌ అన్నమాట!
    చాలా కరెక్ట్‌గా చెప్పారు. మీరన్నట్లుఅక్షరాలా బ్యాక్‌ టు బేసిక్స్‌ ఈ చిత్రం అనిచెప్పాలి. ఇప్పుడు అన్ని లు చాలా రిచ్‌ఫోటోగ్రఫీ, స్లిక్‌ ఎడిటింగ్‌తోవస్తున్నాయి. నేను కావాలనేఅటువంటి ఎక్స్‌ట్రాలు ఏమీ లేకుండా ఈసీక్వెల్‌ తీశాను. హైదరాబాద్‌బ్లూస్‌తో పోల్చితే ఈ చిత్రం బడ్జెట్‌ చాలాఎక్కువే కానీ, అనవసరపుఆర్భాటాలు, హంగులూ ఉండవు. నేరుగాకథ చెప్పడమే.

    టైటిల్‌లోరీ ఎరెంజ్డ్‌ మ్యారేజ్‌ అనే తోకజతపర్చారు. అంటే మన దేశపుఅరెంజ్డ్‌ మ్యారేజ్‌ వ్యవస్థపైవిమర్శనాత్మక హాస్య చిత్రమా?
    అబ్బే లేదండి. హైదరాబాద్‌బ్లూస్‌ చిత్రం వరుణ్‌ నాయుడు(నగేష్‌ కుకునూర్‌), అశ్వినీ నాయుడు(రాజశ్రీనాయర్‌)లు పెళ్ళి చేసుకోవాలనినిర్ణయించుకోవడంతో ముగుస్తుంది.ఈ చిత్రం వారి పెళ్ళైన ఆరేళ్ళతర్వాతి జీవితంతో మొదలౌతుంది. పెళ్ళి, ఉద్యోగం,మానవసంబంధాలు, జీవితంలో ఉండేచిన్న చిన్న సరదా సంఘటనలు,తమాషాలు..వంటి వాటితో పూర్తిగాహైదరాబాద్‌ సంస్కృతిని ప్రతిబింబిస్తూసాగుతుంది. మొదటి చిత్రంలాగే ఇదికామెడిగా ఉంటుంది.

    తెలుగువారు అయి ఉండి ఇంతవరకు తెలుగు తీయకపోవడానికి కారణంఏమిటి?
    భాష రాకపోవడమే. అంటే నాఉద్దేశం, నేను తెలుగులో బాగానేమాట్లాడి, చదవగలిగినా, ఒకరచయిత లెవల్లో రాయలేను.భాషపై అధికారం లేకుండా తీయలేమన్నది నా వ్యక్తిగతఅభిప్రాయం.

    అంటే తీయడానికి అంత భాషా పరిజ్ఞానంఅవసరమనుకుంటున్నారా?
    పాండిత్యం, కవిత్వం రావాలని నేనుఅనను. కానీ మనం మాట్లాడుకునేపద్దతిలో కూడా రాయాలన్నా, దానికీ ఒకపద్దతి, అదీ ఉంటుంది. అలా నేనురాయలేను. జంధ్యాలలాంటిరచయిత ఎవరైనా మీకు తెలిస్తేచెప్పండి, నే ను తప్పకుండా తెలుగు తీస్తా.

    ఇప్పుడున్నతెలుగు దర్శకులకు చాలామందికిఅసలు తెలుగు భాషే రాదు కదా!
    (నవ్వుతూ) నిజమా! ఏమో నాకు తెలీదు.తెలుగులో నాకు బాగే నచ్చేదర్శకుడు కె.విశ్వనాథ్‌ గారు.ఆయన చిత్రాల్లో మామూలు పద్దతిలోనేపాటలు, నృత్యాలు లాంటివి ఉన్నా, ఆయన తీసేచిత్రాలు ఎంతో గొప్పగా ఉంటాయి. నటీనటులఅభినయం ఎంతో కంట్రోల్డ్‌గా ఉంటుంది. అలారావాలంటే రచయిత రాసింది ఏమిటి,అది కరెక్టేనా కాదా అనే చెప్పగలిగేవిధంగానైనా భాషా పటిమ ఉండాలి.నేను తెలుగు ఇంకా బాగానేర్చుకునేందకుప్రయత్నిస్తున్నాను. చూద్దాం,త్వరలోనే తీయవచ్చు.

    మీరుతీసిన సీరియస్‌ చిత్రాలు విజయవంతంకాకపోవడానికి కారణం?
    తీన్‌ దీవారేలాంటి చిత్రాలువిజయవంతం కాకపోవడానికికారణం ప్రధానంగా సరైనవిధంగా పబ్లిసిటీచేయకపోవడమే. మా నిర్మాతలదగ్గర డ బ్బు అయిపోయి ఉంటుంది(నవ్వుతూ) అందుకే ప్రచారం పెద్దగాచేయలేదు.

    మీచిత్రాల్లో ఎక్కువగా మీ వ్యక్తిగతఅనుభవాలు కన్పిస్తుంటాయి. ప్రతిదీఅనుభవించే తీయాలనుకుంటారా?
    అది హౖౖెదరాబాద్‌ బ్లూస్‌లోనేకన్పిస్తుంది. మిగతా ల్లో ఎక్కడకన్పించిందండి బాబూ! తీన్‌ దీవారే ఖైదీలజీవితాల గురించి కదా! నేనైతే ఎప్పుడూజైలుకు వెళ్ళలేదు(నవ్వుతూ).ఇప్పుడు హైదరాబాద్‌ బ్లూస్‌-2లోపెళ్ళిగురించి చెపుతున్నాను. నాకింకాపెళ్ళే కాలేదు. ఇక సొంతఅనుభవాలతో లన్న ప్రశ్నఎక్కడిది.

    పెళ్ళికాకున్నా, ఇతరత్రా అనుభవాలప్రభావం ఉన్నట్లుగా కన్పిస్తుంది కదా!
    ఓ ..అదీ అంటారా..(నవ్వుతూ)..అది వందలు తీసే అనుభవం ఉంది.

    మీ తదుపరిచిత్రాలు ఏమిటి?
    90డేస్‌ అనే రూపొందిస్తున్నాను.రెండు నెలల్లో సెట్స్‌పైకివెళుతుంది. అకస్మాత్తుగా ఒకడికికోట్లాది ఆస్తి క లిసివస్తుంది. కానీ వాడికిక్యాన్సర్‌ వస్తుంది. తొంభై రోజులకన్నాఅధికంగా బతకడని వైద్యులుచెపుతారు. అప్పుడు వాడి ఆ డ బ్బుతో ఎలాజీవితాన్ని గడుపుతాడనేది చిత్రకథ.

    Archives

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X