»   » శ్రీదేవి చివరి చూపుకోసం వచ్చిన రజనీ, చిరు, వెంకీ ఇంకా స్టార్స్ (ఫోటోస్)

శ్రీదేవి చివరి చూపుకోసం వచ్చిన రజనీ, చిరు, వెంకీ ఇంకా స్టార్స్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

దుబాయ్‌లో శ్రీదేవి మరణించగా మూడు రోజుల అనంతరం ఆమె భౌతికకాయం మంగళవారం రాత్రి ముంబై తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. విమానాశ్రయం నుండి శ్రీదేవి డెడ్ బాడీని నేరుగా లోఖండ్‌వాలా రెసిడెన్సీకి తరలించారు. బుధవారం ఉదయం సెలబ్రేషన్స్ క్లబ్‌లో ఆమె భౌతికకాయాన్ని సినీ ప్రముఖులు, ప్రజల సందర్శనార్థం ఉంచారు. దేశ నలుమూలల నుండి పలువురు ప్రముఖులు, అభిమానులు ఆమె చివరి చూపు కోసం తరలివస్తున్నారు.

Sridevi's Mortal At Celebration Sports Club, Watch | Oneindia Telugu
ముంబై చేరిన చిరంజీవి

ముంబై చేరిన చిరంజీవి

శ్రీదేవితో కలిసి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాతో పాటు పలు చిత్రాల్లో నటించిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన సహచర నటి మరణవార్త విని షాకయ్యారు. శ్రీదేవితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఇటీవల ఓ వీడియో బైట్ విడుదల చేశారు. శ్రీదేవి చివరి చూపు కోసం బుధవారం ఉదయం ఆయన ముంబై చేరుకున్నారు.

రజనీకాంత్ ఇప్పటికే వచ్చారు

రజనీకాంత్ ఇప్పటికే వచ్చారు

శ్రీదేవితో కలిసి రజనీకాంత్ అనేక చిత్రాల్లో నటించారు. తన అభిమాన నటీమణుల్లో శ్రీదేవి ఒకరని రజనీకాంత్ అనేక సందర్భాల్లో తెలిపారు. శ్రీదేవి మరణవార్తతో మంగళవారమే రజనీకాంత్ ముంబై వచ్చారు.

ఐశ్వర్యరాయ్

ఐశ్వర్యరాయ్

శ్రీదేవి చివరి చూపు కోసం ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ తన అత్తగారైన జయా బచ్చన్‌తో కలిసి సెలబ్రేషన్ క్లబ్ చేరుకుని శ్రీదేవి భౌతిక కాయాన్ని సందర్శించారు.

అజయ్ దేవగన్ దంపతులు

అజయ్ దేవగన్ దంపతులు

శ్రీదేవి అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చిన బాలీవుడ్ యాక్టర్స్.... అజయ్ దేవగన్, కాజోల్ దంపతులు.

సోనమ్ కపూర్

సోనమ్ కపూర్

తన పెద్దమ్మ శ్రీదేవి అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చిన బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్.

శ్వేతా, జయ

శ్వేతా, జయ

శ్రీదేవి అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చి అమితాబ్ కూతురు శ్వేత, భార్య జయా బచ్చన్.

హేమా మాలిని

హేమా మాలిని

శ్రీదేవి అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చిన ప్రముఖ సీనియర్ నటి హేమా మాలిని. హేమా మాలినికూతురు కూడా ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

కాజోల్

కాజోల్

శ్రీదేవి అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చిన ప్రముఖ నటి కాజోల్.

సుష్మితా సేన్

సుష్మితా సేన్

శ్రీదేవి అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చిన ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ మిస్ వరల్డ్ సుష్మితా సేన్.

టబు

టబు

శ్రీదేవి అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చిన ప్రముఖ నటి టబు.

English summary
Chiranjevi, Venkatesh, Jaya Bachchan & Aishwarya Rai Bachchan pay last respect to Sridevi at Celebration Club, Mumbai on Feb 28, 2017.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu