twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బ్రూస్‌లీ' సెన్సార్ న్యూస్ : చిరు కనపడేది 3 నిముషాలు కాదు

    By Srikanya
    |

    హైదరాబాద్‌: రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌లు జంటగా నటిస్తున్న 'బ్రూస్‌లీ' చిత్రంలో మెగాస్టార్‌ చిరంజీవి ఓ ప్రత్యేక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఆయన కేవలం 3 నిమిషాల యాక్షన్‌ సీక్వెన్స్‌లో కనిపించనున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ వారు సైతం తమ అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. అయితే ఈ రోజు సెన్సార్ 12 గంటలుకు జరిగింది. ఈ సందర్బంగా తెలిసిన విషయం ఏమిటంటే చిరంజీవి ఉండేది నాలుగు నిముషాలని విశ్వసనీయ సమాచారం .

    అలాగే చిరంజీవి దాదాపు ఎనిమిది సంవత్సరాల విరామం తరువాత తమ ప్రాజెక్టులో పనిచేయడంపై చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి డి.వి.వి దానయ్య నిర్మాత. థమన్‌ సంగీతం అందిస్తున్నారు. 'బ్రూస్‌లీ' గీతాలను అక్టోబర్‌ 2న విడుదల చేయనున్నారు.

    Chiru cameo in BruceLee will be a 4 minutes

    చిరు ఎంట్రీపై రామ్ చరణ్ మాట్లాడుతూ...

    ''డాడీ ఈ చిత్రంలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన్ని సెట్లో చూస్తుంటే కొత్త ఉత్సాహం వస్తోంది. ఆయన తదుపరి చిత్రానికి ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ ఓ టీజర్‌ లాంటిది మాత్రమే'' అంటూ రామ్‌చరణ్‌ స్పందించారు.

    రామ్ చరణ్, చిరంజీవి లపై కొన్ని కీలకమైన సన్నివేశాలను మూడు రోజుల పాటు తీస్తారు. చిరంజీవి చాలా రోజుల తర్వాత ముఖానికి మేకప్ వేసుకోవటంతో అభిమానులంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో చిరంజీవి ఈ చిత్రంలో చేయబోయే సీన్స్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయిటకు వచ్చింది.

    లారెన్స్ స్టైల్ సినిమాలో చేసినట్లుగానే చిరంజీవి ఈ సినిమాలో రామ్ చరణ్ ని క్లైమాక్స్ ముందు ఓ కష్టం నుంచి బయిటపడేస్తారు. రకుల్ ప్రీతి ని విలన్స్ నుంచి కాపాడటానికి చిరంజీవి హెల్ప్ చేస్తారు. రామ్ చరణ్ వంటి హీరోకి హెల్ప్ చేయగలవారు ఎవరా అని ఆలోచించి చిరంజీవి అయితేనే బెస్ట్ అని ఒప్పించినట్లు సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి తన నిజ జీవితలో లాగానే మెగాస్టార్ చిరంజీవి గా సినిమా హీరోగా కనిపిస్తారు. అయితే ఇదంతా నిజమా కాదా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ దాకా ఆగాల్సిందే.

    వచ్చే నెల 2న పాటల్ని, 16న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలోని ఓ పాట కోసం ఏకంగా రూ.1.7 కోట్లు ఖర్చు చేశారట. ఈ పాటే కాదు, సినిమా మొత్తం గ్రాండ్‌గా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది.

    English summary
    BruceLeeTheFighter censor at 12 noon. Just came to know that screen time of Chiranjeevi is not 3 minutes, but 4 minutes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X