Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
చాలా మంది సినిమాలు తీస్తారు కోందరే వంద సినిమాలలో నటించి గలరు: ‘చిరు’
కన్నడ హ్యట్రిక్ హీరో శివరాజ్ కుమార్ నటిస్తున్న 'జోగయ్య" సినిమా షూటింగ్ సోమవారం బెంగళూరు నగరంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అధితిగా హజరైన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు, మెగాస్టార్ చిరంజీవి జోగయ్య సినిమా ముహుర్తపు సన్నివేశానికి క్లాప్ కోట్టారు.ఈ సందర్బంగా చిరు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సినిమాలు తీయగలరని కోందరే వంద సినిమాలలో నటించి గలరని అన్నారు. కన్నడ ఆరాద్య దైవం పద్మశ్రీ, డాక్టర్ రాజ్ కుమార్ ఇప్పుడు మన మద్య లేకున్నా ఆయన ఆశయాలు శివన్న నెరవేర్చుతారని అన్నారు. తనకు రాజ్ కుటంబంతో అనేక సంవత్సరాలుగా అనుభందం వుందని గుర్తు చేశారు.
తనకు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయని అయినా రాజ్ కుమార్ కుటుంబంపై వున్న అభిమానంతో వచ్చాననిని చెప్పారు. ఇదే సందర్బంగా శివన్న దంపతులు 'చిరు"కు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమాని హజరైన గజని సూర్య మాట్లాడుతూ జోగయ్య సూపర్ హిట్ కావాలని అన్నారు. తనకు బెంగళూరు నగరం అంటే ఎంతో ఇష్టం అని చెప్పారు. జోగయ్య హిట్ అయ్యి మిగిలిన భాషలలో రీమేక్ కావాలని కోరుకున్నారు. ఇదే సందర్బంగా దళపతి విజయ్ మాట్లాడుతూ ఇంతకు ముందు తనకు జోగి సినిమా చూడాలని అనిపించి డివీడీ కావాలని అనడంతో చిక్కవని చెప్పారని గుర్తు చేశారు. తరువాత నేను బెంగళూరు వచ్చి ధియోటర్ లో జోగీ సినిమా చూశానని గుర్తు చేశారు. అదే విధంగా జోగయ్య సినిమా హిట్ కావాలని అన్నారు. జోగయ్య సినిమా నిర్మాత బహు భాష నటి 'రక్షిత" కావడం విశేషం. శివరాజ్ కుమార్ నూరవ సినిమా జోగయ్య. అదే విదంగా ఆయన సినిమా రంగంలో అడుగు పెట్టి 25 సంవత్సరాలు అయ్యింది. సోమవారం శివన్న 48వ వసంతంలో అడుగు పెట్టారు. జోగయ్య సినిమాకు రక్షిత భర్త ప్రేమ్ దర్శకుడు. ఇంతకు ముందు శివన్న, ప్రేమ్ కలిసి జోగి అనే సూపర్ హిట్ సినిమాను అందించారు.