twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముఖం చాటేసిన మెగాస్టార్ ఫ్యామిలి !

    By Sindhu
    |

    ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు చలనచిత్ర పరిశ్రమ తన వంతు సాయం చేయడం ఎప్పటి నుంచో చేస్తూనే వస్తున్నది. స్వర్గీయ ఎన్టీఆర్ ఆనాడు జోలె పట్టి డబ్బు ప్రోగు చేసి బాధితులను ఆదుకున్న వైనాన్ని ఏ తెలుగు హృదయం మరిచిపోదు. అప్పట్లో సినీ పరిశ్రమ అంతా తారతమ్య భేదాలను వదిలి అంతా ఒక్కటిగా చేరి ఆపన్న హస్తం ఇవ్వడానికి ముందుకు వచ్చేవారు. ఇదిలావుంటే.. నిన్న మా అసోసియేషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు చేయూతనివ్వాలన్న అంశంపై హైదరాబాద్‌లో నిర్వహించిన 'స్టార్ నైట్"కార్యక్రమ మీడియా సమావేశంలో నటుల మధ్య ఉన్న గ్రూపులు స్పష్టంగా బహిర్గతమయ్యాయి. నాగార్జున, చిరంజీవి, ఆయన ఫ్యామిలీ హీరోలు మినహా దాదాపు టాలీవుడ్ హీరోలంతా హాజరయ్యారు. మరి ఇప్పుడో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే సంస్థ గొడుగు కింద ఉన్న తెలుగు చలనచిత్ర రంగంలో అడుగడుగునా గ్రూపులు, గ్రూపు రాజకీయాలు, ఒకరంటే ఒకరికి గిట్టని దౌర్భాగ్యం నేడు తెలుగు సినీ పరిశ్రమలో దాపురించిందని సీనియర్ తెలుగు నటులు వాపోతున్నారు. ఆయా అగ్రశ్రేణి నటుల మధ్య ఉన్న భేదాభిప్రాయాల వల్ల చిన్న నటులు ఏదో ఒక గ్రూపులోకి వెళ్లాల్సిన అగత్యం. ఎవరి కార్యక్రమానికి హాజరవ్వాలో ఎవరి కార్యక్రమానికి వెళ్లకూడదోనన్న గందరగోళంలో నూతన నటులు ఉంన్నట్లు సమాచారం.

    నటుడు మోహన్ బాబు, డాక్టర్ రాజశేఖర్‌లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎటొచ్చీ పరిశ్రమలో హీరోగా రాజకీయాల్లోకి రాకముందు వరకూ దాదాపు పాతికేళ్లు అగ్రాసనం అలంకరించిన చిరంజీవి, ఆయన ఫ్యామిలీకి చెందిన పవన్ కల్యాణ్, రామ్ చరణ్ తో పాటు యువహీరోలందరితో చక్కటి స్నేహసంబంధాలున్న అల్లు అర్జున్ హాజరుకాకపోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. సహజంగానే ఇది పరోక్ష, ప్రత్యక్ష అంశంగా చర్చకు కూడా దారి తీసింది. సమావేశానికి గైర్హాజరైన మెగాస్టార్ చిరంజీవి అండ్ పార్టీని ఉద్దేశించేలా మోహన్ బాబు, రాజశేఖర్ ప్రసంగం సాగింది. ఇలాంటి సమావేశాలకు రాని వారిని పక్కన పెట్టాలని మోహన్ బాబు అన్నారు. అయితే రాజశేఖర్ మాత్రం దూరంగా ఉంచడం మంచిది కాదని, అందరూ కలిసి ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని మా అధ్యక్షుడు మురళీ మోహన్ కాకుండా బాలయ్య ముందు ఉండి నడిపించడం వల్లనే ఈ కార్యక్రమానికి చిరంజీవి కుటుంబానికి సంబంధించిన నటులు రాలేదని పలువురు అనుకోవడం కనిపించింది. కొందరు హీరోలు షూటింగ్ వల్ల రాలేకపోతున్నామని తనకు చెప్పారనీ, వారంతా స్టార్ నైట్ కు పూర్తిగా సహకరిస్తామని మాట ఇచ్చారంటూ బాలకృష్ణ హుందాగా వ్యవహరించడం మాత్రం ప్రశంసలు అందుకుంటోంది. అన్నట్టు చిరంజీవి వరద బాధిత ప్రాంతాల పర్యటనలో ఉండగా, నాగార్జున గోవాలో జరుగుతున్న షూటింగ్ లో ఉన్నారనటంలో ఎంత మాత్రం సమజసం దాగుందో !

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X