Just In
Don't Miss!
- Finance
IMF చీఫ్ గీతా గోపినాథ్‌పై అమితాబ్ వ్యాఖ్యలు, ఏం మాటలు అంటూ నెటిజన్ల అసహనం
- News
ఎస్సై ఆత్మహత్యను రాజకీయంగా వాడుకుంటారా ? చంద్రబాబు, దేవినేని ఉమపై పోలీస్ అధికారుల సంఘం ధ్వజం
- Sports
టీమిండియా ఆటగాళ్లకు మరో కొత్త టెస్ట్.. 8 నిమిషాల్లోనే 2 కిమీ!! ఎన్నిసార్లంటే?
- Automobiles
భారత్‌లో సిట్రోయెన్ మొదటి షోరూమ్ ప్రారంభం, త్వరలో సి5 ఎయిర్‌క్రాస్ విడుదల
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మెగాఫ్యాన్స్ కి షాకిచ్చిన మెగాస్టార్....!
చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజను హీరోగా పరిచయం చేస్తూ యలమంచిలి యుక్త సహ నిర్మాతగా యలమంచిలి గీత సమర్పణలో వై.వి.ఎస్. చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న 'రేయ్" చిత్రం దసరా సందర్భంగా నిన్న (17.10.2010) వైభవంగా ఆరంభమైంది. ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి డా॥ అక్కినేని నాగేశ్వరరావు క్లాప్ ఇవ్వగా, చిరంజీవి కెమెరా స్విచాన్ చేశారు. ఈ సన్నివేశానికి రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. పూజా కార్యక్రమాలను నందమూరి హరికృష్ణ నిర్వహించారు. పవన్‌కళ్యాణ్, నాగబాబు, అల్లు అరవింద్ చేతుల మీదగా ఈ చిత్రం స్క్రిప్ట్‌ను వై.వి.ఎస్. చౌదరి అందుకున్నారు. ఈ వేడుకలో చిరంజీవి భార్య సురేఖ, చిత్ర కథానాయకుడు ధరమ్ తేజ తల్లి విజయ, చిరంజీవి తల్లి అంజనా తదితరులు పాల్గొని వేడుకకు నిండుదనం తీసుకొచ్చారు.
రాజకీయాలకు కాస్త గ్యాప్ ఇచ్చి నెక్స్ ట్ సినిమా పనుల మీద కాన్సన్ ట్రేట్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి, సినిమాలతో ఏర్పడ్డ దూరం వల్ల వచ్చిన వెయిట్ అంతా కరిగించుకునే పనిలో సీరియస్ గా ఉన్నారు. నిన్న మొన్నటివరకు ఓవర్ వెయిట్ తో పూర్తిగా షేపవుట్ అయి కనిపించిన చింరజీవి 'రేయ్" ఓపెనింగ్ వేడుకలో చాలా స్లిమ్ గా కనిపించి ఫాన్స్ కి కూడా షాకిచ్చారు.
'అన్నయ్య" సినిమాలో కనిపించిన తరహా గెటప్ తో చిరంజీవి ఈ వేడుకలో దర్శనమిచ్చారు. చిరంజీవి అంత స్టిమ్ అవడం చూసి సినిమా ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇవ్వడం పట్ల ఆయనెంత సీరియస్ గా ఉన్నారనేది అంతా అర్థం చేసుకున్నారు. సినిమా వచ్చే మార్చిలో మొదలవుతుంది కనుక ఆలోగా చిరంజీవి ఇంకాస్త వెయిట్ తగ్గించాలని చూస్తున్నారు. అయితే తన 150వ చిత్రానికి సంబంధించిన ఎలాంటి వివరాలు బయటకు లీక్ కాకుండా చిరంజీవి చాలా జాగ్రత్త పడుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కథ, దర్శకుడు తదితర వివరాలు బయటకు కాకుండా సకల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.