twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒట్టు... చిరంజీవి అస్సలు కెలకలేదు

    By Srikanya
    |

    హైదరాబాద్ : చిరంజీవిగారు రషెస్‌ను ఇంత వరకు చూడలేదు. కథ విన్నారంతే. ఈ సినిమాలో తాత పాత్ర చాలా కీలకమైంది. ఒక రకంగా ఎస్వీ రంగారావుగారు, అక్కినేని నాగేశ్వరరావుగారు చేయాల్సిన పాత్ర. అందుకే వెంటనే ప్రకాష్‌రాజ్‌గారిని సంప్రతించాం అంటూ చిరంజీవిగారిపైన నెపం రాకుండా నిర్మాత బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. గత కొంతకాలంగా చిరంజీవి ... రామ్ చరణ్ గోవిందుడు అందరివాడేలే చిత్రం చూసారని, అందులో మార్పులు చెప్పారని వార్తలు వస్తున్నాయి. దాన్ని ఖండిస్తూ గణేష్ ఇలా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పుకొచ్చారు. రామ్‌చరణ్‌, కాజల్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'గోవిందుడు అందరివాడేలే'. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు.

    బండ్ల గణేష్ మాట్లాడుతూ... ''గోవిందుడు అందరివాడేలే' విషయంలో ఇటీవల అనేక వదంతులు వినవస్తున్నాయి. ఇది నాకు ఎంతో ప్రతిష్ఠాత్మకమైన సినిమా. కుటుంబ విలువలతో తెరకెక్కుతున్న అచ్చ తెలుగు చిత్రం. పది తరాల వారు గుర్తుంచుకునేలా ఉంటుంది. అందుకే ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగేస్తున్నాం. ఈ క్రమంలో సినిమాలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. అందులో భాగంగానే రామ్‌చరణ్‌ తాత పాత్ర పోషించిన రాజ్‌కిరణ్‌ను మార్చాల్సి వచ్చింది '' అన్నారు.

     Chiru Not Involved In the Film: Bandla Ganesh

    అలాగే రాజ్ కిరణ్ తమిళ నటుడు కావడంతో నేటివిటీ సమస్య రాకుండా ఆయన స్థానంలో ప్రకాష్‌రాజ్‌ను ఎంపిక చేసుకున్నాం. దీని కోసం రాజ్‌కిరణ్‌గారికి క్షమాపణలు చెప్తున్నాను. ఇటీవల రామ్‌చరణ్‌ జ్వరంతో బాధపడటం, మండుటెండల్లో కళాకారుల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకపోవడం.. వంటి కారణాలతో కొద్ది రోజులు చిత్రీకరణ నిలిపేశాం. ఇప్పుడు మళ్లీ చిత్రీకరణ మొదలైంది. వచ్చే నెల 31 వరకు హైదరాబాద్‌లోనే చిత్రీకరణ ఉంటుంది '' అన్నారు.

    ఇక ఆగస్టు 1-15 మధ్య లండన్‌లో చిత్రీకరణ జరు పుతాం. దీంతో షూటింగ్‌ పూర్తవుతుంది. అక్టోబర్‌ 1న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యాం'' అన్నారు.

    రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రమిది. కాజల్‌ హీరోయిన్ . శ్రీకాంత్‌, కమలిని ముఖర్జీ ప్రధాన పాత్రధారులు. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్‌ నిర్మాత. నిర్మాత మాట్లాడుతూ ''ఈ షెడ్యూల్‌లో కుటుంబ సన్నివేశాల్ని తెరకెక్కిస్తాం. అనంతరం లండన్‌లో పాటల చిత్రీకరణ మొదలుపెడతాం. ప్రకాష్‌రాజ్‌, జయసుధలు కీలక పాత్రల్లో కనిపిస్తారు. యువన్‌ శంకర్‌రాజా ఇప్పటికే మూడు పాటల్ని రికార్డ్‌ చేశారు''అన్నారు.

    శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటినటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.

    English summary
    'Chiranjeevi garu has nothing to do with Govindudu Andarivadele and his involvement in the project is just a mere speculation of media. He respects creative work of others but never fingers to advice', said Bandla Ganesh
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X