twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రిస్క్ తీసుకోవటం ఇష్టం లేకే చిరంజీవి

    By Srikanya
    |

    చిరంజీవి తన 150వ చిత్రం కోసం సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నట్లుగా ఉంది. ఆయన రోజూ రెండు గంటలు సేపు డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు సమాచారం. ఆయన తన వయస్సునీ, ఈ మధ్యన వచ్చిన గ్యాప్ ని దృష్టిలో పెట్టుకుని రిస్క్ తీసుకోదలుచుకోలేదని ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. అలాగే రోజుకో గంటసేపు జిమ్ కి వెళ్ళటం చేస్తున్నాడని, తన అభిమానుల నిరాశపరచకూడదని ఆయన నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు. ఇక చరణ్ కూడా రోజూ ఆయన ప్రాక్టీస్ చూసి హ్యాపీ ఫీలవుతున్నట్లు చెప్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందబోయే చిత్రంలో ఆయననటించబోతున్నారని ఫిలింనగర్ తాజా సమాచారం. కడప జిల్లాకు చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. నాటి తెల్లదొరల పాలనకు వ్యతిరేకంగా పోరాడిన త్యాగవీరుడు.

    ఆయన జీవిత గాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తొలుత ఈ చిత్రం దర్శకత్వ బాధ్యతలను చిరంజీవే చేపట్టాలని భావించారు. దర్శకత్వ బాధ్యతలను వివి.వినాయక్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. గతంలో చిరంజీవి-వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన 'ఠాగూర్' చిత్రం సంచలన విజయం నమోదుచేసుకున్న విషయం తెల్సిందే. సమకాలీన రాజకీయ అంశాలను ప్రస్దావిస్తూ గతంలో ఎన్.టి.రామారావు హీరోగా వచ్చిన "సర్ధార్ పాపారాయుడు" చిత్రం తరహాలో తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించిన విషయం తెల్సిందే.ఇక ఈ చిత్రం రాజకీయంగానూ చిరంజీవికి ప్లస్ కావాలని భావిస్తున్నారు.అలాగే ఈ చిత్రంలో రామ్ చరణ్ గెస్ట్ పాత్ర చేయనున్నాడని చెప్తున్నారు.అంతేగాక ఈ చిత్రాన్ని చరణే నిర్మించనున్నారని చిరంజీవి ప్రకటించిన సంగతి తెలిసిందే.

    English summary
    Chiranjeevi doesn’t want to take the risk of hitting the gym or pulling his muscles. Instead, he is becoming fit by satisfying his passion. Every evening, he is spending one hour doing dance practice. Even Cherry who saw few times is feeling great looking at daddy’s steps.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X