»   » చిరంజీవి 150వ సినిమా బోయపాటి దర్శకత్వంలోనా?

చిరంజీవి 150వ సినిమా బోయపాటి దర్శకత్వంలోనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి 150 సినిమాపై రకరకాల ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం వీరి దర్శకత్వంలోనే తెరకెక్కుతోందంటూ ఇప్పటికే పలువురు టాప్ డైరెక్టర్ల పేర్లు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఏ దర్శకుడు ఖరారు కాలేదు. తాజాగా మరో దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి 150వ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో చిరు 150వ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహించబోతున్నారనే ప్రచారం జరిగింది. కానీ ఇపుడు బోయపాటి పేరు వినిపిస్తుండటం ఆసక్తికరంగా మారింది.

బోయపాటి శ్రీను ఇటీవలే బాలయ్యతో 'లెజెండ్' చిత్రాన్ని తెరకెక్కించి పెద్ద హిట్ కొట్టారు. ఈ నేపథ్యంలో బోయపాటి పేరు తెరపైకి రావడంపై పలువురు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి ఇమేజ్‌కు తగిన విధంగా సినిమా తీయడం బోయపాటికి సాధ్యమే, ఫాంలో ఉన్నాడు కాబట్టి సినిమాకు క్రేజ్ వస్తుందని అంటున్నారు.

చిరంజీవి 150వ సినిమాపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల్లో చిరంజీవి ఓటమి పాలయ్యారనే బాధకంటే....ఆయన మళ్లీ తిరిగి సినిమాలపై దృష్టి సారిస్తున్నారనే ఆనందమే అభిమానుల్లో ఎక్కువగా కనిపిస్తోంది.

రామ్ చరణ్

రామ్ చరణ్

ఈ చిత్రాన్ని నిర్మించ బోయేది తానే అని గతంలో రామ్ చరణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ బాధ్యత నుండి రామ్ చరణ్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. వేరొకరి చేతికి ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.ఎవరు నిర్మిస్తారు? ఈ చిత్రాన్ని చిరంజీవి బావమరిదికి చెందిన గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు కూడా మొదలయ్యాయట.

రామ్ చరణ్‌కు అనుభవం లేదు

రామ్ చరణ్‌కు అనుభవం లేదు

నిర్మాతగా రామ్ చరణ్‌కు అనుభవం లేదు. ఈ నేపథ్యంలో అతని చేతికి నిర్మాణ బాధ్యతలు అప్పజెబితే అనవసర ఇబ్బందులు తలెత్తుతాయని చిరంజీవి భావిస్తున్నట్లు సమాచారం.

బోయపాటి శ్రీను

బోయపాటి శ్రీను

‘సింహా', ‘లెజెండ్' లాంటి భారీ హిట్లను తెరకెక్కించిన బోయపాటికి కమర్షియల్ చిత్రాల దర్శకుడి, మాస్ పల్స్ తెలిసిన దర్శకుడిగా పేరుంది. చిరు 150వ సినిమాకు ఆయన పర్ ఫెక్ట్ ఆప్షన్ అంటున్నారు.

అన్ని అంశాలు ఉండేలా...

అన్ని అంశాలు ఉండేలా...

చిరంజీవి 150వ సినిమాలో అన్ని అంశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమా మంచి కథాంశం, సందేశం, కమర్షియల్ ఎలిమెంట్స్ ఇలా అన్ని విషయాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

చిరంజీవి బర్త్ డే గిఫ్ట్

చిరంజీవి బర్త్ డే గిఫ్ట్

ఈ సారి మెగా అభిమానులకు చిరంజీవి బర్త్ డే ఆగస్టు 22న 150 సినిమా కానకగా అందనుందని మెగాఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

English summary
Latest reports are to be believed, the hot and happening director, Boyapati Sreenu is all set to direct Chiranjeevi’s 150th film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu