»   » మణి కలిసాడు, చిరంజీవి 150వ సినిమాపై కొత్త డౌట్స్!

మణి కలిసాడు, చిరంజీవి 150వ సినిమాపై కొత్త డౌట్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి 150వ సినిమా గురించి ఈ మధ్య హాట్ హాట్ చర్చసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన 150వ సినిమా వివి వినాయక్ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం గత కొంత కాలంగా జరుగుతోంది. అయితే తాజాగా మెగాస్టార్ సినిమాపై కొత్త డౌట్స్ ప్రారంభమయ్యాయి. ఈ డౌట్స్ ప్రచారంలోకి రావడానికి కారణం ప్రముఖ దర్శకుడు మణిరత్నం.

ఇటీవల మణిరత్నం తన భార్య సుహాసినితో కలిసి హైదరాబాద్ వచ్చారు. 'సచిన్' అనే ఓ డబ్బింగ్ సినిమా గురించి వీరు హైదరాబాద్ వచ్చినట్లు ప్రచారం జరుగుతున్నా.....వీరు హైదరాబాద్ రావడం వెనక అసలు ఎజెండా వేరనే వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవితో దగ్గరి పరిచయం ఉన్న తన భార్య సుహాసిని తీసుకుని మణిరత్నం వచ్చారని, చిరంజీవితో 150వ సినిమా గురించి చర్చించారని అంటున్నారు.

ఇటీవల తనను కలవడానికి వచ్చిన చిరంజీవిని...గవర్నర్ నరసింహన్ సరదాగా 150వ సినిమా గురించి అడిగ్గా, సమాధానంగా చిరంజీవి..... మణిరత్నం ప్రస్తావన తెచ్చినట్లు టాక్. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ చిత్రంలో రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా నటించే అవకాశం ఉందని అంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి లాంటి వారితో సినిమా మొదలయ్యే క్రమంలో ఇలాంటి రకరకాల ప్రచారాలు జరుగడం మామూలు. అయితే అసలు విషయం ఏమిటనేది అఫీషియల్ సమాచారం వెలువడే వరకు చెప్పడం కష్టమే. అభిమానులకు అప్పటి వరకు ఈ గంధరగోళ వార్తలు భరించక తప్పదు.

గీతా ఆర్ట్స్ చేతికి 150వ సినిమా..

గీతా ఆర్ట్స్ చేతికి 150వ సినిమా..


ఈ చిత్రాన్ని చిరంజీవి బావమరిదికి చెందిన గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు కూడా మొదలయ్యాయట.

చరణ్‌కు ఛాన్స్ లేనట్లేనా?

చరణ్‌కు ఛాన్స్ లేనట్లేనా?


రామ్ చరణ్‌కు అనుభవం లేదు నిర్మాతగా రామ్ చరణ్‌కు అనుభవం లేదు. ఈ నేపథ్యంలో అతని చేతికి నిర్మాణ బాధ్యతలు అప్పజెబితే అనవసర ఇబ్బందులు తలెత్తుతాయని చిరంజీవి భావిస్తున్నట్లు సమాచారం.

 వినాయక్ అయితే ఠాగూర్‌ ను మించేలా..

వినాయక్ అయితే ఠాగూర్‌ ను మించేలా..


గతంలో చిరంజీవికి ఠాగూర్ లాంటి అద్భుతమైన సినిమాను అందించిన వివి వినాయక్ ఈ సారి తనకు అవకాశం ఇస్తే అందుకుకు ఏ మాత్రం తీసిపోకుండా చిరంజీవి 150వ సినిమాను తీస్తాడట.

అన్ని మాసాలాలు పడాల్సిందే...

అన్ని మాసాలాలు పడాల్సిందే...


చిరంజీవి 150వ సినిమాలో అన్ని అంశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమా మంచి కథాంశం, సందేశం, కమర్షియల్ ఎలిమెంట్స్ ఇలా అన్ని విషయాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

పుట్టినరోజు కానుక

పుట్టినరోజు కానుక


ఈ సారి మెగా అభిమానులకు చిరంజీవి బర్త్ డే ఆగస్టు 22న 150 సినిమా కానకగా అందనుందని మెగాఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

English summary

 Film Nagar source said that, ace director Manirathnam reportedly met megastar Chiranjeevi and his star son Ram Charan Tej on May 20th at their residence. Mani gave a narration for 1-hour and Chiru was impressed with the gripping story.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu