For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సంక్రాంతి బ‌రిలో మెగాస్టార్ కన్ఫామ్ అయినట్టే , జనవరిలోనే ఖైదీ రాకను పక్కా చేసిన రామ్ చరణ్

  |

  చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా ఖైదీ నంబర్ 150 ఫస్ట్ లుక్ విడుదలై అభిమానుల మనస్సులను దోచుకున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రాడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ చిత్రం కత్తికి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు సగం పూర్తయ్యింది.

  అభిమానులంతా ఎదురు చూస్తున్న ఈ క్రేజీ మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రిలో రిలీజ‌వుతోందని చాలా రోజులుగా అనుకుంటున్నదే. కానీ అఫీషియలా ఎక్కడా దృవీకరించలేదు. ఈ చిత్రంలో అందాల‌ కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. వి.వి.వినాయక్ ఈ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై మెగాపవర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల రిలీజైన మెగాస్టార్ స్టిల్స్‌కి, మోష‌న్ పోస్ట‌ర్‌కి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చినందుకు చిత్ర‌యూనిట్ ఎంతో హ్యాపీగా ఉంది. ఇప్ప‌టికే 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. 2017 సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు.

  Chiru’s Khaidi No. 150 to hit the screens On Sankranti

  ఇప్పుడిది అఫీషియల్... ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. చిరంజీవి 150వ సినిమా సంక్రాంతి బరిలో నిలిచింది. మొన్నటివరకు గాసిప్ గా ఉన్న ఈ విషయాన్ని నిజం చేశాడు చ‌ర‌ణ్. ఇదివరలోనే వీ.వీ వినాయక్ కూడా ఖైదీ నంబర్-150ను వచ్చే ఏడాది భోగి రోజున.. అంటే జనవరి 13న విడుదల చేయాలని నిర్ణయించారంటూ చెప్పారు కానీ అది మామూలుగా అన్న విషయమే తప్ప అప్పటికి ఇంకా అధికారికంగా చెప్పలేదు.

  ప్రస్తుతం చిరు సినిమాకు సంబంధించి కామెడీ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మరో 10 రోజుల్లో ఈ షెడ్యూల్ అయిపోతుంది. ఇది కంప్లీట్ అయిన వెంటనే... రామోజీ ఫిలింసిటీకి షిఫ్ట్ అవుతాడు చిరంజీవి. అక్కడ ఐటెంసాంగ్ కోసం ప్రత్యేకంగా సెట్ వేస్తున్నారు. ఆ భారీ సెట్ లో చిరంజీవి-క్యాథరీన్ మద్య ఓ ఐటెసాంగ్ ను పిక్చరైజ్ చేస్తారు. సినిమా విడుదల తేదీతో పాటు టీజర్ ను అక్టోబర్ చివర్లో విడుదల చేసే అవకాశం ఉంది.

  చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నంబ‌ర్ 150 సంక్రాంతి బ‌రిలో నిలిచింది. ఈ విష‌యాన్ని చ‌ర‌ణ్ అధికారికంగా ధృవీక‌రించాడు కూడా. కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి వి.వి.వినాయక్ ద‌ర్శ‌కుడు . కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చ‌ర‌ణ్‌ నిర్మిస్తున్నాడు. ఇప్ప‌టికే 70 శాతం చిత్రీకరణ పూర్తయిందని, 2017 సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు చ‌ర‌ణ్ ప్ర‌క‌టించాడు.

  Chiru’s Khaidi No. 150 to hit the screens On Sankranti

  నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ -70 శాతం పైగా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. నాన్న‌గారు డ‌బ్బింగ్ కూడా ప్రారంభించారు. ఇప్ప‌టివ‌ర‌కూ చ‌క్క‌ని ఔట్‌పుట్ వ‌చ్చింద‌న్న సంతృప్తి ఉంది. అన్ని ప‌నులు పూర్తి చేసి, జ‌న‌వ‌రిలో సంక్రాంతి కానుక‌గా ఖైదీ నంబ‌ర్ 150 చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం అన్నారు.

  డిసెంబ‌రు నుంచి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్ని ఓ రేంజులో చేయాల‌ని చ‌ర‌ణ్ భావిస్తున్నాడు. మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు కీ చిరు కొన్ని కాల్షీట్లు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంది. అందుకే అటు ఎమ్‌బీకే, ఇటు 150వ సినిమా అంటూ చిరు ప్ర‌తి క్ష‌ణం బిజీగా గ‌డుపుతున్నాడు. ఇప్ప‌టికే దేవిశ్రీ ప్ర‌సాద్ పాట‌ల్ని సిద్దం చేసేశాడ‌ని, అందులో ఐటెమ్ గీతం ఓ రేంజులో వ‌చ్చింద‌ని చెబుతున్నారు. కేథ‌రిన్ ప్ర‌త్యేక గీతంలో క‌నిపించ‌నుంది. బాలీవుడ్ న‌టుడు త‌రుణ్ అరోరా ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపిస్తున్న ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర కోసం శ్రియ‌ని సంప్ర‌దిస్తున్న‌ట్టు స‌మాచారం. ద‌స‌రా కానుక‌గా.. టీజ‌ర్ కూడా విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.

  English summary
  Mega Hero Ram Charan Who is Producing the Movie is conformed the News Officially That Chiranjeevi’s Khaidi No 150 To Be Released During Sankranthi 2017
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X