»   » ఇంకా డైలమాలోనే మెగాస్టార్.! ఉయ్యాల వాడ ఉన్నట్టా లేనట్టా..

ఇంకా డైలమాలోనే మెగాస్టార్.! ఉయ్యాల వాడ ఉన్నట్టా లేనట్టా..

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బ్రిటిష్ దొరతనాన్ని ఎదిరించి వీరమరణం పొందిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాపై కదలిక వచ్చింది. పరుచూరి బ్రదర్స్ చెప్పిన 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' కథను స్టాండ్‌బైగా పెట్టుకున్నట్టు గతం లోనే మెగాస్టార్ చిరంజీవి చెప్పేసాడు . చాలా సంవత్సరాల క్రితం పరుచూరి బ్రదర్స్ చెప్పిన 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' కథని చిరంజీవి ఒకే చేసారు. ఈ కథలో విప్లవాత్మక థీమ్ తో పాటు పవర్ఫుల్ పాత్రకి కూడా ఆస్కారం ఉంది. ప్రస్తుతం చిరంజీవికి ఈ సినిమా వర్క్ అవుట్ అవుతుందా? ఇదే ప్రశ్న ప్రస్తుతం అందరి మదిలోనూ ఉంది. చిరు కూడా ఈ స్క్రిప్ట్ ని పరిశీలిస్తున్నారని సమాచారం.

  వాస్తవానికి 150వ సినిమా కోసం కథలు వినే సమయంలో "ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి" కథను చిరంజీవి విన్నారు. ఆ సమయంలోనే ఈ కథను తన 151వ చిత్రంగా తీయాలని అనుకున్నారు. అదేసమయంలో దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా ఓ కథని చెప్పారు. ఈ కథ కూడా చిరంజీవికి నచ్చింది. ఈ రెండు చిత్రాల్లో ఏదో ఒకటి తన 151వ చిత్రంగా ఉండబోతుందన్నది ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

  Chiru's Uyyalawada gets a New Director?

  'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' తలపెడితే చారిత్రిక చిత్రం కాబట్టి ఎక్కువ సమయం తీసుకునే అవకాశాలు ఎక్కువ. అది పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుందనేది ఇప్పుడే అంచనా వేయడం కష్టం కాబట్టి ఈలోగా ఏదైనా కమర్షియల్‌ స్క్రిప్ట్‌ కుదిరితే వేగంగా పూర్తి చేసి ఇదే ఏడాదిలో విడుదల చేసి, ఆ సమయం లోనే 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేయిస్తే మంచిదనేది చిరంజీవి ఆలోచన అట.

  అయితే సురేందర్‌ చెప్పిన కథ కానీ,ఇప్పటివరకూ విన్న మరిన్ని కథలు కానీ చిరంజీవికి పెద్దగా కనెక్ట్ కాలేదట . మరోవైపు పరుచూరి సోదరులు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' లేటెస్ట్‌ డ్రాఫ్ట్‌ వినిపించారని, అది విని చిరంజీవికి ఈ చిత్రం చేయాలనే కుతూహలం మరింత పెరిగిందని చెప్పుకుంటున్నారు కానీ ఇప్పటికైతే దీనిమీద ఎలాణ్టి సమాచారమూ లేదు. అగ్ర హీరోలతో సినిమాలు తీసిన అనుభవమున్నవాడు, సాంకేతిక పరమైన అవగాహన కలిగినవాడు కావడంతో ఈ ప్రాజెక్ట్‌కి సురేందర్‌ రైట్‌ అని చిరంజీవి 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'ని అతనికి అప్పగించినట్టు అనధికారిక సమాచారం.

  ఒకవేళ అన్నీ సిద్ధమైతే ఏప్రిల్‌లోనే ఇది మొదలు పెట్టాలని, అలా కుదరకుంటే ఆ సమయానికల్లా ఒక కమర్షియల్‌ చిత్రం చేసిన తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి ఇది ప్రారంభించాలని అనుకుంటున్నారని, అందుకే ఉయ్యలవాడ మీద ఎటువంటి అధికారిక ప్రకటనా చేయటం లేదని తెలిసింది.

  English summary
  Actually Paruchuri Brothers have other day revealed that this film is being written by them, but it will be directed by Surender Reddy. After handling action and action-comedies all these days, we have to see how Suri will handle this historical subject featuring Chiru in the titular role.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more