For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రిమేక్‌కత్తి మీద సామే, శంకర్‌దాదా విన్నింగ్‌గేమే: చిరు

  By Staff
  |
  హోంపేజి సినిమా ఇంటర్వ్యూ

  Monday, October 04 2004

  హిందీలోవచ్చిన మున్నాభాయ్‌ ఎం.బి.బి.యస్‌.చిత్రానికి తెలుగు రీమేక్‌ శంకర్‌దాదాపై భారీ అంచనాలున్నాయి. తెలుగువెండితెరపై పసిడి పంట పండింగలచిరంజీవి ఈ చిత్రం గురించి ఏమంటున్నారు?ఆయన ఇంటర్వ్యూ.....

  ఇంద్ర,ఠాగూర్‌ వంటి గొప్ప పాత్రలు చేసిన తర్వాతశంక ర్‌ దాదా, ఎంబిబిస్‌ వంటి మాస్‌ఎంట ర్‌టైనర్‌ చేయడానికి కారణమేమిటి?

  ఇంద్రఠాగూ ర్‌ వంటి సినిమాలు చేసిన తర్వాతనా తదుపరి చిత్రం ఎలా ఉంటుందా అన్న అంచనాలుప్రేక్షకుల్లో, అభిమానుల్లో సహజంగాఎక్కువగానే ఉంటాయి. దాంతో గొప్పకేరక్టర్లు ఎంపిక చేసుకోవడంకష్టమవుతోంది. ప్రేక్షకులు నానుంచిపూర్తి వినోదం, సాంగ్స్‌, ఫైట్స్‌ ఆశిస్తారు.అటువంటి పూర్తి స్ధాయి వినోద చిత్రం కోసంఎదురుచూస్తున్న సమయంలో ... అంటేఉదాహరణకు ఘరానా మొగుడుదొంగమొగుడు రౌడీ అల్లుడుబావగారూ బాగున్నారా సినిమాలకోవలో ఒక చిత్రం చేస్తే నాకు కొత్త ఉత్సాహంఊపు ఉంటుంది అనుకుంటున్న సమయంలో నాకీసినిమా తారసపడింది. వెంటనే ఒప్పుకున్నాను.అదీగాక ఇందులోని పాత్ర యూనివర్సల్‌గాఆదరణ పొందిన పాత్ర. హిందీలో సంజ య్‌దత్‌ బాగా చేశాడు. మంచి సినిమా, మంచిక్యారెక్టర్‌ను ప్రేక్షకులు ఆదరిస్తారుగనుక మున్నాబాయి సినిమాను చూడగానేఓకే చేశాను.

  దర్శకుడుజయంత్‌పై మీ అభిప్రాయం?

  లైటర్‌వెయిన్‌ కథలకు బాగా స్పందించేమనస్తత్వం ఆయనది. ఆ తరహాచిత్రాలను బాగా తీయగలరు కూడా. ఈసినిమాకి డైరెక్టర్‌ ఎవరైతేబాగుంటుందా అని ఆలోచిస్తున్న తరుణంలోజెమిని కిరణ్‌, తదితరులుజయంత్‌ పేరును సజెస్ట్‌ చేశారు.మంచి సూచన అంటూ నేనుఅంగీకరించాను. సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఉన్నమనిషి ఆయన. కూల్‌గా, సరదాగా ఉంటూవర్క్‌ చేస్తారు. టెన్షన్‌ పడరు,ఇతరులను హడావిడి పెట్టేమనస్తత్వం కాదు ఆయనది.మోడ్రన్‌ వ్యూస్‌, థాట్స్‌ ఉన్న వ్యక్తి. ఈతరహా చిత్రాలను నేను ఎలా చేయగలనోబాగా తెలిసిన వ్యక్తి కనుకజయంత్‌ ఈ చిత్రాన్ని బాగా డీల్‌చేయగలడనే అభిప్రాయానికి వచ్చాం.అనుకున్న విధంగానే ఆయన ఈ చిత్రానికిచక్కగా చేసి బాగా తీశారు.

  ఠాగూర్‌తర్వాత మీరు చేసిన మరో రీమేక్‌సినిమా ఇది. రిమేక్‌ల వల్లఇబ్బందులుంటాయంటారా?

  ఇబ్బందులుసహజమే. ఒక రకంగా రీమేక్స్‌చేయడం కత్తి మీద సామే. ఎందుకంటేఒక సినిమా నూటికి నూరు శాతంనచ్చిన తర్వాత రీమేక్‌ చేయడంజరుగుతుంది. కాబట్టి నచ్చిన అంశాలన్నీపెట్టుకుంటాం. కొన్ని సీన్లు ఇంప్రమైజ్‌చేసిన తర్వాత వాటిని పెట్టుకుంటాం. దీనివల్ల లెంగ్త్‌ పెరిగి ఒక్కోసారి ఆ ఒరిజినల్‌ఫ్లేవర్‌ మిస్‌ అయ్యే అవకాశాలు ఉంటాయి.బాగా రక్తి కట్టించిన సినిమాను మళ్లీతీయడం, మెప్పించడం చాలా కష్టం. ఆవిషయంలో చాలా కేర్‌ తీసుకుంటూ ఎట్టిపరిస్థితులలోనూ లెంగ్త్‌పెరగకూడదని జాగ్రత్తలు తీసుకున్నాం.ఒరిజినల్‌లో నాలుగు సాంగ్స్‌ ఉన్నాయి. వాటిల్లోరెండు హీరో మీద ఉన్నాయి. తెలుగులోఅయిదు పాటలున్నాయి. అన్నీ హీరో మీదే ఉండాలి.హిందీ వెర్షన్‌లో ఫైట్స్‌ లేవు,తెలుగులో కనీసం రెండు ఫైట్లన్నాపెట్టుకోవాలి. దాదా అన్న టైటిల్‌పెట్టినందుకు రెండు ఫైట్స్‌ అన్నాలేకపోతే రక్తి కట్టించదు... ఇలానోటితో అనుకుంటూనే లెంగ్త్‌ పెంచేశాం.ఒరిజినల్‌లో అన్నీ మాకు నచ్చాయి. అవన్నీతెలుగులోనూ ఉండాలి. ఈ రకంగా చూస్తే,ఒకటిన్నర సినిమా అయిపోయింది. అందుకేఎంతో ఆలోచించి ఒరిజినల్‌ ఫ్లేవర్‌ పోకుండా,క్రిస్ప్‌గా సీన్స్‌ రూపొందించి, ఈ సినిమాతయారు చేయడం జరిగింది.మున్నాభాయ్‌లో హార్ట్‌ టచింగ్‌ సీన్లు కొన్నిఉన్నాయి. వాటిని అలాగే ఉంచేస్తూ లైటర్‌వెయిన్‌ పరంగా కారెక్టర్‌ను నాస్టయిల్‌కి అనుగుణంగా మార్చుకునిడీల్‌ చేయడం జరిగింది. నా ఇమేజ్‌ని,కారెక్టర్‌ని దృష్టిలో ఉంచుకొని మిగతాకమర్షియల్‌ ఎలిమెంట్‌ ఏమీ మిస్‌ కాకుండాఅన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం.

  శంకర్‌దాదాలో ఉన్న ఐటెం సాంగ్స్‌ గురించిచెప్పండి...

  ఈసినిమాలో సిట్యుయేషనల్‌ సాంగ్స్‌ ఐటెంసాంగ్స్‌గా, సోలో సాంగ్స్‌గారూపుదిద్దుకున్నాయి. శంకర్‌దాదా పాటనే తీసుకోండి. ఆత్మహత్యాప్రయత్నం చేసిన ఒక యువకుడినిప్రేమ విషయంలో ఎడ్యుకేట్‌ చేస్తూసున్నితమైన సందేశాన్ని అందిస్తూ ఐటెంసాంగ్‌గా చేయడం జరిగింది. ఫస్ట్‌ హాఫ్‌లోరెండు ఐటెం సాంగ్స్‌, సెకండాఫ్‌లోధాచాసాంగ్‌ ఉంటాయి. ఈ మూడు మంచి మాస్‌సాంగ్స్‌. మ్యూజికల్‌గా ఇవి బాగున్నాయనిఆడియో సేల్స్‌ చెబుతున్నాయి. ఇకవిజువల్‌గా కూడా అందరినీ అలరిస్తాయి. ఒకటి,అర ఐటెం సాంగ్‌ని ఆశించే అభిమానులకు ఈమూడు పాటలు బోనస్సే. ఈ సినిమాప్రారంభంలో ఐటెంసాంగ్‌కి తగినసన్నివేశం కుదరక పోవడంతోడ్యూయెట్‌ పెట్టాం. తర్వాత మూడుఐటెం సాంగ్స్‌, చివర్లో మళ్లీ డ్యూయెట్‌....

  వీటిలోమీ ఫేవరెట్‌ సాంగ్స్‌ ఏమిటి?

  చైలాచైలా, శంకర్‌దాదా ఈ రెండు నాకుబాగా నచ్చిన పాటలు. మిగిలిన పాటలనుతక్కువగా తీసెయ్యడానికి లేదు. అవి కూడాబాగా నచ్చాయి.

  మీనోటి నుంచి వెలువడే ప్రతి మాటనివేదవాక్కుగా భావించే వారెందరోఉన్నారు. అలాంటప్పుడు మీ సినిమాలలో డైలాగ్స్‌పరంగా, నటనపరంగా ఎలాంటి కేర్‌తీసుకుంటున్నారు?

  సినిమాపవర్‌ఫుల్‌ మీడియా అనడానికిసందేహించనవసరం లేదు.మీరన్నట్లు ఒక సీనియర్‌ నటుడిగా,ఇమేజ్‌ ఏర్పరుచుకున్న వ్యక్తిగా ఒకమాట నా నుంచి వస్తుందంటే దానిప్రభావం ఉండకుండా ఉండదు. అయితేప్రేక్షకులు కూడా ఏది నేను సీరియస్‌గాచెబుతున్నాను, ఏది ఎంటర్‌టైన్‌మెంట్‌కోసం చెబుతున్నాను అని చూసి ఫీల్‌అవుతున్నారు. సీరియస్‌గా చెప్పేదాన్నిసీరియస్‌గా తీసుకోవడం, జోక్‌గాచెప్పేదాన్ని జోక్‌గా తీసుకోవడమనేమెంటల్‌ ప్రిపరేషన్‌ ఆడియన్స్‌లోనూఉందని నేను అనుకుంటున్నాను.ఆడియన్స్‌కి నాకు మధ్య ఒకఅవగాహన ఏర్పడింది. ఈ సినిమాలో చైలచైల అనే పాటుంది. అందులో లవ్‌ గురించి చిన్నమెసేజ్‌ని చాలా సరదాగా చెప్పాను.అదేమిటంటే ప్రేమ అనేది జీవితంలో చిన్నభాగం మాత్రమే, ప్రేమ ఫెయిల్‌అయిందని ఆ అమ్మాయిని చంపడమో, లేకనువ్వు చావడమో క్షమించరానినేరం. జీవితం భగవంతుడిచ్చినగొప్ప వరం. దానినిసద్వినియోగపరుచుకోవాలి అంటూ నేనుచెప్పిన సందేశంలోని ఆంతర్యాన్నిఅందరూ గ్రహించి, ఆలోచనలో పడి,ఆచరణలో పెడతారనే నమ్మకంనాకుంది. మంచి విషయంచెప్పాలనుకున్నప్పుడు అంతసీరియస్‌గా చెబుతాను. సరదాఅనుకున్నప్పుడు నేనూ సరదాగాచేస్తాను. వాళ్లు ఎంజాయ్‌ చేస్తారు.

  ఈసినిమాలో శ్రీకాంత్‌ పాత్రకు ఉన్నప్రాధాన్యం ఏమిటి?

  నాతోఒక సినిమాలోనైనా చేయాలనే కోరికశ్రీకాంత్‌లో ఉంది. మున్నాభాయ్‌ సినిమాచూడగానే అందులోని పాత్రకు శ్రీకాంత్‌సరిపోతాడని వెంటనే అనిపించింది. ఈ సినిమాలోడిఫరెంట్‌గా శ్రీకాంత్‌ కనిపిస్తారు. ఈపాత్రని శ్రీకాంత్‌ చేయగలడాఅనుకున్నవారు సైతం ముక్కునవేలు వేసుకునే విధంగా చేశాడు. పాటల్లోఇద్దరం పోటీ పడి చేశాం.

  మీపాటల్లో కొరియోగ్రఫీకి ఎంతో ప్రాధాన్యంఉంటుంది కదా. కొరియోగ్రాఫర్ల గురించిచెప్పండి..

  సాంగ్స్‌అన్ని బాగా వచ్చాయి. అందరికీ మంచి పేరువస్తోంది. ఎస్‌.పి. పరుశురామ్‌ చిత్రంతర్వాత మళ్లీ ఇప్పుడు చిన్న ప్రకాష్‌ఇందులోని చైలా చైలా సాంగ్‌ని కంపోజ్‌చేశారు. కంపోజిషన్‌గానీ, సీక్వెన్స్‌గానీబాగా చేశారు. అలాగే అశోక్‌ రాజా కంపోజ్‌చేసిన శంకర్‌ దాదా ఎం.బి.బి.యస్‌,హరీష్‌ పాయ్‌ కంపోజ్‌ చేసిన నాపేరే కంచనా మాల పాట యువతరాన్నిఎంతో అలరిస్తాయి.

  ఒకసినిమా ప్రారంభం నుండి అది పూర్తయిరిలీజ్‌ అయ్యే వరకూ దాని గురించిప్రతిక్షణం ఆలోచించి ఎంతో కేర్‌ తీసుకునేమీరు విడుదలైన తర్వాత ఏంచేస్తారు?

  చాలారిలాక్స్‌ అయిపోతాను. ఆ సినిమా మీద నాదృష్టే ఉండదు. ఆ సినిమా ఎంతో సక్సెస్‌అయింది అని ఎవరైనా చెబితే అలాగాఅనుకుంటాను తప్ప డిటెయిల్స్‌లోకివెళ్లను. అందరు బాగుండాలి, అందరికీమంచి లాభాలు రావాలని కోరుకుంటాను. ఎంతోఆశించిన ఆడియన్స్‌కి ఫుల్‌ఎంటర్‌టైన్‌మెంటు ఇవ్వగలిగాను అనిసంతోషంగా ఫీల్‌ అవుతాను. ఫెయిల్‌అయితే మాత్రం నా ఆలోచన విధానంచేరేగా ఉంటుంది. ఇలా ఎందుకు జరిగింది, లోపంఎక్కడుంది అని చాలా రోజుల పాటు దాని గురించేఆలోచిస్తాను. ఆ ఫెయిల్యూర్‌ ఎక్కువ కాలంనన్ను హాంట్‌ చేస్తుంటుంది.

  ఈచిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌పై మీ అభిప్రాయం?

  ఈ సినిమా కోసం దేవి ఎంతో కష్టపడ్డారనేచెప్పాలి. నాకున్న మాస్‌ ఫాలోయింగ్‌,పాటలకి ఫ్యాన్స్‌ రియాక్షన్‌.... అన్నీఅధ్యయనం చేశారు. సన్నివేశాన్నిదృష్టిలో పెట్టుకుని ఏ పాట ఏ రేంజ్‌లో ఉండాలన్నవిషయం ఆలోచించి ట్యూన్స్‌ తయారు చేశారు.నెంబరాఫ్‌ ట్యూన్స్‌ కంపోజ్‌ చేసి వాటినిమాకు వినిపించడమన్నదిసాధారణంగా జరిగే పద్ధతి. కానీ దేవి ఒకేఒక్క ట్యూన్‌ వినిపించి, మా చేత ఓ.కె.చేయించుకున్నాడు. అంటే ఆ ఒక్క ట్యూన్‌కోసం ఎంతో సిన్సియర్‌గా హోం వర్క్‌ చేసిఉంటారు. ఏమిటి ఒకటే ట్యూన్‌వినిపిస్తున్నారు? అవి బాగుండకపోతే మళ్లీఅంత తీసుకుని మరో ట్యూన్‌ వినిపిస్తారా? అనిఅనుకుంటూ ఆ ట్యూన్‌ విన్న మాకు ప్రతి ట్యూన్‌చాలా బాగా నచ్చింది.

  మీతదుపరి చిత్రానికి దర్శకుడిగా శ్రీనువైట్ల ఎలా ఎంపికయ్యారు?

  నేనువెంకి సినిమా చూసిన తర్వాతఒక రోజు శ్రీను వైట్ల నా షూటింగ్‌కి వచ్చారు.మీరు సినిమా చూశారని తెలిసింది సార్‌.అప్పుడు నేను రాలేకపోయాను. ఎలా ఉందిసార్‌? అని అడిగారు. ఆ సినిమా గురించివిపులంగా చెప్పాను. నీ వర్క్‌ బాగుందనిచెప్పాను. ఆ సమయంలోనే నాకుఅనిపించింది. మనం తీయబోయే నెక్ట్స్‌ప్రాజెక్ట్‌ అతనికి ఆఫర్‌ చేస్తేబాగుంటుందని. ఈ ప్రపోజల్‌ అరవింద్‌గారికిచెప్పడం, ఆయన కూడా అంగీకరించడంజరిగింది. భూపతిరాజా కథ మీద బాగావర్కవుట్‌ చేసిన తర్వాతఅందరం కూర్చుని విన్నాం. ఇంట్రెస్టింగ్‌గా,నాకే మళ్లీ ఎగ్జయిటింగ్‌గా సినిమాఉంటుంది.

  గుడుంబాశంకర్‌ సినిమా మీరు చూశారా?

  చూశానండి.కచ్చితంగా అది మంచి ఎంటర్‌టైనర్‌.సన్నివేశాలు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు.అక్కడక్కడ లెంగ్త్‌ కొంచెంఎక్కువయిందేమోనన్న ఫీలింగ్‌ వచ్చిందికానీ ఆడియన్స్‌లో ఆ ఫీలింగ్‌ లేదు. సాంగ్స్‌బాగా వచ్చాయి. కళ్యాణ్‌ చాలాడిఫరెంట్‌గా దాంట్లో ప్రొజెక్టుచేయబడ్డాడు. జానీ లాంటి హెవీకారెక్టర్‌ కంటే ఇలా సరదాగా,హుషారుగా ఉండే కారెక్టర్లను వాడినుంచి కోరుకుంటున్నాను. మిగిలినవాళ్లందరూ కూడా బాగా చేశారు.గుడుంబా శంకర్‌ అని టైటిల్‌పెట్టడం వల్ల ఇదేదో యాక్షన్‌ మూవీఅనుకొన్న ఫ్యాన్స్‌ నుండి మొదట్లోమిక్సెడ్‌ రిపోర్ట్‌ వచ్చింది కానీ ఇప్పుడుసెటిలయింది. మూడవ వారంలోకి ఎంటర్‌అయిన తర్వాత కూడా కలెక్షన్లుస్టడీగా ఉన్నాయి. ఇది సక్సెస్‌ఫుల్‌ సినిమా అనిఅన్నివర్గాల వారు ఒప్పుకుంటన్నారు.

  ఇంటర్వ్యూ:వినాయకరావు

  (స్టూడియోరౌండప్‌ సౌజన్యంతో)

  Archives

  హోంపేజి

  More TELUGU FILM NEWS News

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X