»   » ఏ ట్రూ ఫుటేజ్ ఫిల్మ్, చిత్రమ్ కాదు నిజమ్ విడుదల తేదీ ఖరారు

ఏ ట్రూ ఫుటేజ్ ఫిల్మ్, చిత్రమ్ కాదు నిజమ్ విడుదల తేదీ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇటీవ‌ల క‌న్న‌డంలో 6-2=5 పేరుతో విడుద‌ల‌ై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఈ చిత్రం చూసిన ప్రేక్ష‌కులు ఇది చిత్ర‌మా లేక నిజ‌మా అనే సందిగ్దంలో ప‌డ్డారు. ఏమాత్రం డ్ర‌ామ‌ాటిక్ ఎలిమెంట్స్ లేకుండా ఓ అడ‌విలో ట్ర‌క్కింగ్‌కి వెల్లిన ఆరుగురు ఫ్రెండ్స్ చుట్టూ తిరిగే క‌థ‌గా తెర‌పై క‌నిపిస్తుంది. కాని సినిమాకి ఏమాత్రం త‌గ్గ‌కుండా రియ‌ల్ ఇన్సిడెంట్ మ‌న క‌ళ్ళ‌ముందు జ‌రుగుతున్న మ‌ధురానుభూతిని క‌లిగిస్తుంది.

ఇప్పుడు ఏప్రిల్ 3న తెలుగు లో ఆదే ఫుటేజ్ ని తీసుకుని తెలుగు ప్రేక్ష‌కులకి గుడ్‌సినిమా గ్రూప్, శ్రీ శైలేద్ర ప్రోడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ లు సంయుక్తంగా అందిస్తున్నారు. అస‌లు ఈ స్టోరి చిత్రమా నిజమా అనే దాన్ని బేస్ చేసుకుని చిత్రం కాదు నిజమ్ అనే టైటిల్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు నిర్మాత‌లు.


అస‌లు జ‌రిగిన విష‌యానికోస్తే..


2010లో ఆరుగురు ఫ్రెండ్స్ సరదాగా ట్రెక్కింగ్ చేయడానికి మంగుళూరుకు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ అడవిలోకి వెళ్లి, కనిపించకుండా పోయారు. అప్పుడు వాళ్లు తీసుకెళ్లిన కెమెరా 2012లో దొరకగా అందులోని విజువల్స్ లో వాళ్లు ఏ విధంగా కనపడకుండా పోయారో తెలిసింది. ఆ విజివ‌ల్స్ చూసిన అట‌వీశాఖ వారు ఆశ్య‌ర్యానికి గుర‌య్యారు. ఓ విధంగా వారి మ‌న‌సు క‌లిచివేసింది. ఆ విష‌యం ఆనోటా ఈనోటా బ‌య‌ట‌కి పొక్కి క‌న్న‌డ‌లోని కొంద‌రు ఈ విజ‌వ‌ల్స్ ని చూడాల‌నుకున్నారు. అనుకోవ‌ట‌మే త‌రువాయి అట‌విశాఖ వారిని సంప్ర‌దించి ఆ విజువ‌ల్స్ ని చూశారు. వారి హృద‌యం బ‌రువెక్కింది. ఈ విజువ‌ల్స్ ని ఎలాగైనా సినిమా రూపంలో ప్రేక్ష‌కుల‌కి అందించాల‌నుకుని అట‌వీ శాఖ‌లో ఉన్న‌తాధికారుల అనుమ‌తి తీసుకుని ఇప్పుడు ఆ విజువల్స్ ని సినిమా రూపంలో ఎడిటింగ్ చేసి, యథావిధిగా, అటవీశాఖ అనుమతితో మీ ముందుకు తీసుకురావడం జరిగింది.


Chitram kadu Nijam releasing date finalised

ఇది వినడానికి వింతగా ఉన్నాచిత్రమ్ కాదు నిజ‌మ్‌...చిత్ర పరిశ్రమలోనే ఓ అరుదైన రికార్డుగా నిలుస్తుంది. ఇప్పుడు ఈ య‌ధార్ద‌సంఘ‌ట‌న‌ని ఈరోజుల్లో, రొమాన్స్, విల్లా, భద్రమ్ వంటి విజయవంతమైన వైవిధ్యమైన చిత్రాల్ని అందించిన గుడ్ సినిమా గ్రూప్, శ్రీ శైలేంధ్ర ప్రొడక్షన్స్ తో కలిసి సంయుక్తంగా తెలుగు ప్రేక్ష‌కుల‌కి అందిస్తున్నారు. రమేష్ ఈ ఫుటేజ్ ని షూట్ చేశారు. అన్ని కార్యక్ర‌మాలు పూర్తిచేసుకుంది, ఏప్రిల్ 3 న విడుద‌లవుతుంది.


ఈ చిత్ర విశేషాల గురించి నిర్మాత జి.శ్రీనివాస‌రావు మాట్లాడుతూ " ఓ అరుదైన సంఘటన ఆధారంగా రూపొందించి చిత్రంగా తీసుకొస్తున్నాం. మంగుళూరుకు సమీపంలోని ఫారెస్ట్ లో ఆరుగురు ఫ్రెండ్స్ కనిపించకుండా పోయిన సంఘటనల సమాహారమే 'చిత్రమ్ కాదు నిజమ్'. వాళ్లు కనిపించకుండా పోయినా...వారికి సంబంధించిన కెమెరా ఒకటి దొరికింది. అందులోని విజువల్సే చిత్రమ్ కాదు నిజమ్. అంటే ఏ ట్రూ ఫుటేజ్ ఫిల్మ్. అటవీశాఖ అనుమతి తీసుకొని ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. ఈరోజుల్లో, రొమాన్స్, భద్రమ్, విల్లా వంటి వైవిధ్యమైన చిత్రాల్ని అందించిన గుడ్ సినిమా గ్రూప్...' చిత్రమ్ కాదు నిజమ్' వంటి అద్భుతమైన సినిమా అందిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్రాన్ని శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ తో కలిసి రిలీజ్ చేస్తున్నాం. ఏప్రిల్ 3న‌ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం" అని అన్నారు.

English summary
Chitram kadu Nijam film will be released on April 3, according to the film producer G Sriniavas Rao.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu