»   » విడాకులు తీసుకున్న హీరోయిన్, ఆ గొడవలేనా?

విడాకులు తీసుకున్న హీరోయిన్, ఆ గొడవలేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: భారత గోల్ఫర్‌ జ్యోతి రణ్‌ధావా, మోడ ల్‌, బాలీవుడ్‌ హీరోయిన్‌ చిత్రాంగద సింగ్‌ తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలికారు. గత కొంత కాలంగా వీరి మధ్య అభిప్రాయభేదాలు రావడమే ఇందు కు కారణంగా కనిపిస్తోంది. గత సంవత్సరమే చిత్రాంగద సింగ్‌ విడాకుల కోసం గుర్‌గావ్‌లోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌ వేసింది.

ఈ విషయాన్ని గోప్యంగా ఉంచమని తన లాయర్‌ను కోరింది. వీరికి ఓ కుమారుడు జొరావర్‌ రణ్‌ధావా ఉన్నాడు. గతంలోనే వీరి మధ్య ఉన్న విభే దాలను మీడియా బయటపెట్టినప్పుడు అటువంటిదేమీ లేదని చిత్రాంగద నమ్మబలికింది. అయితే చాలా కాలంగా వీరి మధ్య అభిప్రాయభేదాలున్నాయని రణ్‌ధా వా సన్నిహితుడొకరు గతంలోనే మీడియాకు తెలిపారు. ఒకరి ప్రొఫెషన్‌ అంటే మరొకరికి నచ్చడం లేదని అతను తెలిపాడు.

Chitrangada Singh, Jyoti Randhawa Gets Divorced

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నవంబర్ 11, 2013న కోర్టు వీరికి విడాకులు మంజూ చేసింది. అయితే ఇంత కాలంగా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. తాజాగా వారి సన్నిహితుల ద్వారా ఈ విషయం బయటకు లీకైంది. కావాలనే చిత్రీంగద సింగ్ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచింది.

చిత్రాంగద గత కొంత కాలంగా బాలీవుడ్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా తన గ్లామర్ విశ్వరూపాన్ని చూపిస్తోంది. ఫోటో షూట్లు, షూటింగుల పేరుతో బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలో ఆమె, భర్త జ్యోతి రన్ ధావా మద్య విభేదాలు ఏర్పడినట్లు తెలుస్తోంది.

English summary
The news of Chitrangada and her golfer husband Jyoti Randhwa splits can be confirmed now that they have been granted divorce on November 11, 2013. Despite the couple denying all facts about their troubled marriage.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu