Don't Miss!
- Finance
Boeing: నిరుద్యోగులకు శుభవార్త.. వేలాది మందిని రిక్రూట్ చేసుకోనున్న జెట్ లైనర్
- News
మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూత..!!
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
సచిన్ ఆ మాట అనడంతో షాక్ తిన్న విక్రమ్: ఇద్దరి మధ్య అసలేం జరిగింది?
Recommended Video

లోకల్‌గా ఎంత పెద్ద స్టార్ అయినా.. ఒక్కసారి రాష్ట్రం దాటితే అసలు గుర్తుపట్టేవాళ్లే ఉండకపోవచ్చు. రీజినల్ స్టార్స్ క్రేజ్ రాష్ట్రానికే పరిమితం కాబట్టి.. పక్క రాష్ట్రాల్లో వాళ్ల ముఖాలను గుర్తుపట్టడం కష్టమే. తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్‌కు ఇటీవల ఇలాంటి అనుభవమే ఎదురైందట. అది కూడా సాదాసీదా వ్యక్తి నుంచి కాదు..

విక్రమ్ పక్కన సచిన్..:
ఇటీవల ఓ 'షో'లో పాల్గొనడం కోసం విక్రమ్ ముంబై వెళ్లారు. అక్కడ కార్యక్రమం ముగియగానే వెంటనే ఫ్లైట్ క్యాచ్ చేశారట. విమానంలో కూర్చొన్నాక.. పక్కన ఎవరున్నారా? అని చూస్తే.. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కనిపించారట.

షాక్ తిన్న విక్రమ్..:
సచిన్‌ను అమితంగా ఇష్టపడే విక్రమ్.. తన పక్క సీట్లోనే ఆయన్ను చూసేసరికి సంతోషం పట్టలేక పలకరించారట. అయితే సచిన్ మాత్రం విక్రమ్‌ను గుర్తుపట్టలేదేట. అంతేకాదు, మీరెవరు? అంటూ ప్రశ్నించడంతో విక్రమ్ షాక్ తిన్నాడట.

తనకు తానే పరిచయం చేసుకుని..:
బాలీవుడ్‌లో అమితాబ్ సైతం తనను గుర్తుపడుతారు కదా!.. సచిన్‌కు తాను తెలిసే అవకాశం లేదా? అని మనసులో అనుకున్నాడట విక్రమ్. ఏదేమైనా.. ఇక తనకు తానే సచిన్‌కు పరిచయం చేసుకున్నాడట. తన సినిమాల గురించి వివరించాడట.

సచిన్ అలా చెప్పారట..:
తాను ఎక్కువగా హాలీవుడ్ సినిమాలే చూస్తుంటానని, సౌత్ ఇండస్ట్రీ సినిమాల గురించి అంతగా అవగాహన లేదని, అందువల్లే గుర్తుపట్టలేకపోయానని విక్రమ్‌కు చెప్పారట సచిన్. ఇదంతా విక్రమే స్వయంగా వెల్లడించడం గమనార్హం.

రీజినల్ స్టార్స్ ను గుర్తుపట్టడం కష్టమే..:
క్రికెట్ లోకంలోనే ఎక్కువ సమయం గడిపే సచిన్.. రెగ్యులర్ సినిమాలు చూడటం కష్టమే. దొరికిన కాస్త టైమ్‌లో అయినా.. ఎవరైనా సరే ది బెస్ట్ సినిమాలే చూడాలనుకుంటున్నారు. ఆవిధంగా చాలామంది ఛాయిస్ హాలీవుడ్ సినిమాలే. కాబట్టి రీజినల్ స్టార్స్ గురించి జాతీయ స్థాయి సెలబ్రిటీలకూ అంతగా అవగాహన ఉండకపోవచ్చు.

'స్కెచ్' రెడీ:
భారీ అంచనాల మధ్య విడుదలైన 'ఐ' ఫ్లాప్ అవడం విక్రమ్ కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. వరుస పరాజయాల నుంచి గట్టెక్కేందుకు తాజాగా 'స్కెచ్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విక్రమ్. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలోనే 'సచిన్' విషయాన్ని ప్రస్తావించాడు.
ఇకపోతే స్కెచ్ సినిమా దాదాపుగా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతోనైనా విక్రమ్ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నారు.