విక్రమ్ కు హార్ట్ ఎటాక్ కాదట... అసలు విషయం ఇదే.. అసలు ఏమైందంటే?
తమిళ స్టార్ హీరో విక్రమ్ గుండెపోటు కారణంగా హాస్పిటల్ పాలయ్యారని అటు తమిళ సహా తెలుగు మీడియా వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే అది నిజం కాదని విక్రమ్ సన్నిహిత వర్గాల వారు ఆ వార్తలను ఖండించారు. అయితే అసలు విక్రమ్ కు ఏమైంది? ఆయన ఎందుకు హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు? అనే వివరాల్లోకి వెళితే...

హై ఫీవర్
శుక్రవారం మధ్యాహ్నం విక్రం గుండెపోటు కారణంగా తన నివాసం దగ్గర్లో ఉన్న కావేరి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు అంటూ సోషల్ మీడియాలో మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే నిజానికి చియాన్ విక్రమ్ హాస్పిటల్ లో చేరిన మాట వాస్తవమే కానీ ఆయన హాస్పిటల్ లో చేరింది హై ఫీవర్ కారణంగా అని తెలుస్తోంది.

డిశ్చార్జ్ చేసే అవకాశం
ఆయన హాస్పిటల్ కి వెళ్లడంతో కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఎటాక్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ విషయం మీద విక్రమ్ సన్నిహితులు స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. తాజా సమాచారం మేరకు ఆయన ఐసీయూ నుంచి సాధారణ వార్డుకి షిఫ్ట్ చేయబడ్డారని, ఆయనకు సంబంధించి కొన్ని టెస్టులు చేస్తున్నారని ఆ టెస్టులు సాయంత్రంలోగా పూర్తి అయితే కనుక సాయంత్రం ఆయనను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని కూడా వారు వెల్లడించారు.

ఈవెంట్ కు మాత్రం డౌటే
11 అంటే సోమవారం నాడు జరగవలసిన కోబ్రా మూవీ ఆడియో లాంచ్ కి కూడా ఆయన హాజరయ్యే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇక నేడు చెన్నై వేదికగా జరుగుతున్న పొన్నియన్ సెల్వన్ టీజర్ లాంచ్ ఈవెంట్ కు మాత్రం ఆయన హాజరయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. గుండెపోటు కాకపోయినా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న విక్రమ్ ఈవెంట్ కి హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.

ఇదే ఏడాది విడుదల
హార్ట్ ఎటాక్ అంటూ ప్రచారం మొదలైన నేపధ్యంలో ఇప్పుడు తాజాగా వెల్లడైన విషయంతో కొంత ఉపశమనం కలిగించే విధంగా ఉన్నాయని చెప్పక తప్పదు. విక్రమ్ పిఆర్ టీం కూడా ఈ విషయాన్ని కన్ఫామ్ చేసింది. ఆయనకు హై ఫీవర్ కారణంగా కొంత అస్వస్థత ఏర్పడడంతో వెంటనే కావేరి హాస్పిటల్ కి తీసుకువెళ్లాం కానీ ఆయనకు అంతకు మించి ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు లేవని వెల్లడించారు. ఇక ఆయన హీరోగా నటించిన రెండు సినిమాలు ఇదే ఏడాది విడుదలకు సిద్ధమవుతున్నాయి.

ఆనందం
ఆయన చేసిన కోబ్రా సినిమా త్వరలో విడుదల కాబోతోంది. అలాగే మణిరత్నం దర్శకత్వంలో ఆయన చేసిన పొన్నియన్ సెల్వన్ కూడా ఇదే ఏడాది విడుదల కాబోతోంది. పారంజిత్ తో కలిసి మొట్టమొదటిసారి విక్రమ్ ఒక సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా తన తాజా ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ఇండియాలోనే ఒక భారీ 3d ఫిలిం గా రూపొందిస్తామని ఆయన కామెంట్స్ చేశారు. ఇది ఒక పాన్ ఇండియా మూవీగా తీర్చిదిద్దుతామని దక్షిణాది సహా ఉత్తరాది నుంచి అన్ని భాషలకు సంబంధించిన నటీనటులు కూడా ఈ సినిమాలో భాగమవుతారని ఆయన వెల్లడించారు. గుండెపోటు వార్త నిజం కాదని తెలియడంతో ఆయన అభిమానులైతే ప్రస్తుతానికి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











