»   » దటీజ్ మాధవన్.. చాక్లెట్ బాయ్ ఏం చేశాడో తెలిస్తే షాక్..

దటీజ్ మాధవన్.. చాక్లెట్ బాయ్ ఏం చేశాడో తెలిస్తే షాక్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ నటుల్లో చాక్లెట్ బాయ్ మాధవన్‌ది ప్రత్యేకమైన శైలి అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎందుకంటే సఖీ, యువ, సాలా ఖద్దూస్, త్రీ ఇడియట్ చిత్రాల్లో ఆయన విభిన్నమైన నటనను ప్రదర్శించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాడు. అయితే నటన పరంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా మాధవన్ ఇటీవల ప్రత్యేకతను సొంతం చేసుకొన్నాడు. ఎలాంటి కసరత్తులు, వర్కవుట్లు చేయకుండా, జిమ్‌కు వెళ్లకుండానే భారీగా తన బరువును, ఒళ్లును తగ్గించుకొని అందరికి షాక్ ఇచ్చాడు. 'కొంచెం లావు తగ్గాను' అని మాధవన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

 chocolate boy Madhavan lose weight without workouts

తాను సన్నపడటం వెనుక ఉన్న ఆరోగ్య చిట్కాను వివరించాడు. సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆహారం తీసుకోవడం మానేశాను. ప్రతీ భోజనానికి మధ్య ఐదున్నర గంటల గ్యాప్ ఉండేలా చర్యలు తీసుకొన్నాను. దాంతో బరువును గణనీయంగా తగ్గించుకొన్నాను. ఎలాంటి వర్కవుట్లు, జిమ్ కెళ్లకుండా సులభంగా సన్నబడటనం సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు.

English summary
Madhavan said thay I have managed to achieve this look without any workout and just followed my own secret diet.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu