»   » హ్యాట్సాఫ్ లారెన్స్....! అని ఇది చదివాక మీరే అంటారు....

హ్యాట్సాఫ్ లారెన్స్....! అని ఇది చదివాక మీరే అంటారు....

Posted By:
Subscribe to Filmibeat Telugu

సాటి వాడు కష్టం లో ఉన్నప్పుడు వీలైనంత వరకూ కనీస సాయం అందించాలన్న స్పృహ అతి తక్కువ మందికే ఉంటుంది. నేను సంపాదించుకున్నాను కదా .. వేరే వాళ్లకి ఎందుకివ్వాలి. అన్న వారికి ఏం చెప్పలేం కానీ. సినిమా ఇండస్ట్రీలో మాత్రం తమ కు ఆ స్థాయినిచ్చిన అభిమానులనీ ప్రజలనీ ఆదుకోవటం తమ భాద్యత గా భావించే వారు ఎక్కువాగానే ఉన్నా.... మొత్తంగా కలిపిచూస్తే కనీస స్పందన ఉన్న వాళ్ళు తక్కువే కనిపిస్తారు.

అందులో లారెన్స్ ఒకడు. సంపాదన కోట్లలోనే ఉండొచ్చు అయితే లారెన్స్ సేవా కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టే డబ్బూ అలాగే ఉంటుంది. ఏడాదికి ఒక సినిమాకి 10-15 కోట్లు తీసుకునే ఒక హీరో ఎప్పుడో ఉప్పెనలు వచ్చినప్పుడు 50 లక్షలు, ఇవ్వటమో కోటీ రెండుకోట్లు ఇవ్వటమో గొప్పకాదు. కానీ తన సంవత్సరాదాయం 7 కోట్లుకూడా నిఖరంగా లేని లారెన్స్ లాంటి నటుడు తన సంపాదనలో సంవత్సరామ్నికి రెండు కోట్ల వరకూ ఖర్చు చేయతం మామూలేం కాదు.

 Raghava Lawrence

చిన్న తనం నుంచే లారెన్స్ ఎన్నో కష్టాలు పడి ఒక నృత్య దర్శకుడిగా - ఒక సినీ దర్శకుడిగా - నటుడిగా ఎదిగాడు. కెరీర్ లో తనకంటూ ఒక స్థాయి వచ్చాక కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం మొదలుపెట్టాడు. ఎంతోమందికి గుండె శస్త్ర చికిత్సలు చేయించిన లారెన్స్. ఇప్పటి వరకూ 130 మందికి ఆర్థికసాయం ఆదించి శస్త్ర చికిత్సలు చేయించటం గమనార్హం. తాజాగా అభినేష్ అనే కుర్రాడికి గుండె ఆపరేషన్ కోసం సాయపడ్డారు. అభినేష్ చాలా రోజులుగా గుండెకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న లారెన్స్ ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. దీంతో సోమవారం నాడు అభినేష్ కి సాయం ప్రకటించారు. ప్రస్తుతం అభినేష్ ఆరోగ్యంగా ఉన్నాడని చెబుతున్నారు.

ఇప్పుడు కొత్తగా చేయటం కాదు నిజానికి కొన్ని సంవత్సరాలనుంచే ఇంకా ఎన్నో సామాజిక సేవకార్యక్రమాలు చేస్తున్నాడు. అనాథలు - వికలాంగులను ఆదుకునేందుకు ఆశ్రమాలను కట్టించిన సంగతి తెలిసిందే. అలాగే చాలామంది అభాగ్యులను దత్తత తీసుకుని వారికి విద్యాబుద్ధులు చెప్పిస్తూ వారి పోషణ బాధ్యతల్ని తన కర్తవ్యంగా భావిస్తూ... నెలలో కొన్ని రోజుల పాటు తానే స్వయంగా ఆ ఆశ్రమాల్లో ఉంటూ అందరినీ పలకరిస్తూ తిరుగుతూంటాడు. ఎంతైనా కొందరంతే.... తమ తో పాటు జీవించే హక్కు ఇంకా చాలా మందికి ఉందన్న విషయాన్ని గుర్తించే మనుసులు... హేట్సాఫ్ లారెన్స్

English summary
South Indian Choreographer turned actor, director Raghava Lawrence has once again proved how good a human being he is.., Lawrence financially helped a small kid named Abinesh for his heart surgery
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu