twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య మీద లైంగిక వేధింపుల కేసు.. సంచలన ఆరోపణలు చేసిన కో డ్యాన్సర్

    కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య

    |

    ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేస్తున్నా మహిళల మీద లైంగిక వేధింపుల ఘటనలు మాత్రం తెర మీదకు వస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా సినీ పరిశ్రమలో కూడా ఈ ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యపై ముంబై పోలీసులు లైంగిక వేధింపులు, వేధింపులు, వేధింపుల ఆరోపణలపై చార్జిషీట్ దాఖలు చేశారు . ఆ వివరాల్లోకి వెళితే

     'ఊ అంటావా మావ' సాంగ్ కి

    'ఊ అంటావా మావ' సాంగ్ కి

    చెన్నైకి చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య.. సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. తెలుగులో ఆయన ఎక్కువగా అల్లు అర్జున్ సినిమాలకు పని చేశారు. రీసెంట్ గా 'పుష్ప' సినిమాలో 'ఊ అంటావా మావ' సాంగ్ కి కొరియోగ్రఫీ చేశారు. అయితే తాజాగా ఆయన మరోమారు వార్తల్లోకి ఎక్కారు.

    పలు సెక్షన్ల కింద కేసు

    పలు సెక్షన్ల కింద కేసు


    అందుతున్న సమాచారం మేరకు గణేష్ ఆచార్య సహా ఆయన సహాయకుల మీద భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 354-A (లైంగిక వేధింపులు), 354-సి (చూడడం), 354D, 509 ( మహిళ గౌరవానికి భంగం కలిగించడం), 323 (బాధ కలిగించడం), 504 (శాంతి భంగం కలిగించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 506 (నేరపూరిత బెదిరింపు) సహా 34 సెక్షన్ల మీద కేసు నమోదు చేయబడింది.

    2020లోనే

    2020లోనే


    2020లో గణేష్ ఆచార్య మీద అతని సహ-డ్యాన్సర్ ఒకరు ఆరోపణలు చేశారు. ఇదే కేసులో పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. ఫిర్యాదును విచారించిన ఓషివారా పోలీసు అధికారి సందీప్ షిండే, అంధేరీలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఇటీవల ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు తెలిపారు ఇక ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు పోలీసులు తనకు చెప్పారని కేసు పెట్టిన 35 ఏళ్ల కో-డ్యాన్సర్ చెప్పారు.

    పరువు నష్టం దావా

    పరువు నష్టం దావా


    ఈ విషయంపై వ్యాఖ్యానించేందుకు గణేష్ ఆచార్య నిరాకరించారు. ఇప్పటికే చాలా మంది గణేష్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. గణేష్ కూడా వాటన్నిటినీ తోసిపుచ్చాడు. అవన్నీ అబద్ధాలని, నిరాధారమైన ఆరోపణలు అని పేర్కొన్నాడు. సహ-డ్యాన్సర్ ఫిర్యాదుపై ముంబై పోలీసులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినప్పుడు, గణేష్ ఆచార్యకు చెందిన లీగల్ టీమ్ ఫిబ్రవరి 2020లో పరువు నష్టం దావా వేసింది.

    Recommended Video

    John Abraham కామెంట్స్ పై South Indian ఫ్యాన్స్ ఫైర్ | Filmibeat Telugu
     అసిస్టెంట్స్ తో దాడి

    అసిస్టెంట్స్ తో దాడి


    అయితే తనతో లైంగిక సంబంధాన్ని తిరస్కరించిన తర్వాత ఆచార్య తనను వేధించడం ప్రారంభించాడని ఆమె ఫిర్యాదులో ఆరోపించారు. గణేష్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని, పోర్న్ సినిమాలు చూపించి వేధిస్తున్నారని కూడా ఆరోపించారు. గణేష్ ఆచార్య బలవంతంగా అనుభవించాలని చూశాడని ఆమె ఆరోపించారు. అంతేకాక ఆమె డ్యాన్సర్ గా నిలబడాలి అంటే 2019లో తనతో కాంప్రమైజ్ అవ్వాలని కోరాడని ఆమె ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసేందుకు నిరాకరించడంతో న్యాయవాదిని ఆశ్రయించి కేసు నమోదు చేశారు. అయితే 6 నెలల తర్వాత ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ కొరియోగ్రాఫర్ అసోసియేషన్ గణేష్ ఆచార్య సభ్యత్వాన్ని రద్దు చేసింది. గణేష్ తన అసిస్టెంట్స్ తో దాడి చేయించాడని.. ఆ మహిళా అసిస్టెంట్లు తనను దారుణంగా కొట్టి.. బూతులు తిట్టారని అందుకే గణేష్ ఆచార్యపై కేసు పెట్టానని ఆమె పేర్కొంది.

    English summary
    Choreographer Ganesh Acharya charged by Police under multiple ipc sections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X