»   »  చిరంజీవిని మోసం చేయడం జీర్ణించుకోలేక పోయారు!

చిరంజీవిని మోసం చేయడం జీర్ణించుకోలేక పోయారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్లో బాగా పాపులర్ అయిన సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ జీవితంలోని పలు విషయాలు మీడియాతో పంచుకున్నారు. ఈ క్రమంలో చిరంజీవికి సంబంధించిన డాడీ సినిమా ప్రస్తావన కూడా వచ్చింది.

'డాడీ' మూవీ అంతగా సక్సస్ కాకపోవడానికి గల కారణం ఆ సినిమాలో చిరంజీవి ఫ్రెండ్ చేతిలో మోసపోయే పాత్ర చేసాడని ఇది జనాలకు నచ్చక పోవడంతో ఆ సినిమా ఫెయిల్ అయిన విషయాన్ని గుర్తుకు చేసారు చోటా కె. నాయుడు. ఈ సినిమా చాలా మంచి కాన్సెప్టు, చిరంజీవి గారు ఎంతో అద్భుతంగా చేసారు. కానీ చిరంజీవి గారి కళ్లలో నీళ్లొచ్చేసరికి ప్రేక్షకులు తట్టుకోలేక పోయారు. అందుకే సినిమా సరిగా ఆడలేదు అన్నారు.

చిరంజీవి గారు మోసపోవడం ఏమిటి అనే జనాల ఫీలింగ్ వల్ల ఆ సినిమా ఫెయిల్ అయింది అని అంటూ చిరంజీవిని మోసం చేసే ఆలోచనను తెలుగు ప్రేక్షకులు తట్టుకోలేరు అని ఈ సందర్భంగా చోటా చెప్పడం గమనార్హం.

Chota K Naidu about Chiranjeevi

తెలుగు సినిమాలలో స్టోరీ కంటే ముఖ్యంగా ఫైట్లు పాటలు సినిమాలో ముఖ్యం అవడానికి కారణం మెగాస్టార్ చిరంజీవే అన్నారు చోటా. చోటా చెప్పింది అక్షరాల నిజం. చిరంజీవి అంత పెద్ద స్టార్ అయ్యారంటే ఆయన చేసే డాన్సులు, ఫైట్సే, పెర్ఫార్మెన్సే.... ఆయన సినిమాలు భారీ విజయం సాధించడానికి కారణం కథకంటే ముఖ్య కారణం ఫైట్స్, డాన్స్, పెర్ఫార్మెన్స్ విషయంలో చిరంజీవి ప్రదర్శించే ప్రత్యకమైన స్టైలే...

అందుకే చిరంజీవి 150వ సినిమాలో కూడా డాన్సులు, ఫైట్స్ విషయంలోనే ఎక్కవ ఫోకస్ పెడుతున్నారు. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా జూన్ 15 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఆల్రెడీ పూజా కార్యక్రమాలతో లాంచనంగా ప్రారంభమైన ఈ చిత్రం తొలి షెడ్యూల్ ఫైట్ సీన్లతో ఆరంభం కానుంది. తమిళంలో హిట్టయిన 'కత్తి' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి 'కత్తిలాంటోడు' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.\

English summary
Chota K Naidu about Chiranjeevi. Chota K Naidu is one of the best and talented cinematographers in Telugu industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu