»   » ఆది ‘చుట్టాలబ్బాయ్’ ఫస్ట్ లుక్ (ఫోటో)

ఆది ‘చుట్టాలబ్బాయ్’ ఫస్ట్ లుక్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యువ నటుడు ఆది హీరోగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘చుట్టాలబ్బాయ్'. తాజాగా ఆది పుట్టినరోజు(డిసెంబర్ 23) సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు. ఎస్‌.ఆర్‌.టి. మూవీ హౌస్‌ మరియు శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్‌ పతాకాలపై వీరభద్రమ్‌ దర్శకత్వంలోలో రాము తాళ్ళూరి, వెంకట్‌ తలారి నిర్మిస్తున్నారు.

ప్రేమకావాలి, లవ్‌లీ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో యూత్‌కి, ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరైన లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది, అహనా పెళ్లంట, పూలరంగడు వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో దర్శకుడుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న వీరభద్రమ్‌ ఫస్ట్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని నిర్మాతలు తెలిపారు.


Chuttalabbayi movie first look

ప్రస్తుతం ఆది ‘గరం' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆది, ఆదాశర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘గరం'. మదన్ దర్శకత్వంలో శ్రీమతి వసంత శ్రీనివాస్ సమర్పణలో పి.సురేఖ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ టీజర్‌ను హీరో ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేసారు.


ఈ నెల 23న ఆది బర్త్‌డే. ఈ సందర్భంగా గరం ఆడియో ఆవిష్కరన వేడుక జరగనుంది. అత్యంత వైభవంగా జరగనున్న ఈ వేడుకలో పలువురు సినీ రంగ ప్రముఖులు పాల్గొననున్నారు. పెళ్లైన కొత్తలో ఫేం అగస్త్య ఈ చిత్రానికి స్వరాలందించారు. ‘గరం' చిత్రానికి కథ, మాటలు: శ్రీనివాస్‌ గవిరెడ్డి, కెమెరా: సురేందర్‌రెడ్డిటి. సంగీతం:ఆగస్త్య, కళ: నాగేంద్ర, ఎడిటింగ్‌: కార్తీక్‌ శ్రీనివాస్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత:బాబ్జీ, కో-డైరెక్టర్‌: అనిల్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మదన్‌

English summary
Actor Aadi's Chuttalabbayi Movie First Look Image. Directed by Veerabhadram Chowdary and produced by Aishwarya Lakshmi Movies.
Please Wait while comments are loading...