»   » ఎవరికి మూడిందో‌: శ్రుతిహాసన్‌ కేసు...సీఐడీ స్పీడు

ఎవరికి మూడిందో‌: శ్రుతిహాసన్‌ కేసు...సీఐడీ స్పీడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: శ్రుతి హాసన్‌ చిత్రాలపై ఉత్పన్నమైన వివాదంలో సీఐడీ పోలీసులు న్యాయ విభాగాన్ని సంప్రదించనున్నారు. రామ్‌ చరణ్‌తేజ్‌, అల్లుఅర్జున్‌లతో కలిసి తాను నటించిన 'ఎవడు' చిత్రంలో కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలను గుర్తు తెలియని వ్యక్తులు అంతర్జాలంలో పెట్టారంటూ శ్రుతిహాసన్‌ కొద్దిరోజుల క్రితం సీఐడీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

సైబర్‌ విభాగం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టింది. సీఐడీ అధికారులు ఒకరిద్దరు ఛాయాగ్రహకులను పిలిపించి విచారించారు. సాంకేతిక ఆధారాలను సేకరించేందుకు ఫొటోలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు పంపించారు. న్యాయ విభాగం సూచనలు, ఫోరెన్సిక్‌ ప్రయోగశాల ఫలితాలొచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐడీ వర్గాలు తెలిపాయి. ఆ వ్యక్తులు దొరికి కేసు నిరూపితమైతే జైలు శిక్ష పడే అవకాశముంది.

Cid enquiry on Shruti Hasan leaked pictures

అయితే ఇప్పుడు ఈ కేసులో ఎవరు ఇరుక్కోబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. నిర్మాత నిర్లక్ష్యం కూడా ఇందులో విచారణకు వస్తుందా అనే విషయం సైతం చర్చకు వస్తోంది. కావాలని ఎవరైనా ఈ ఫొటోలను లీక్ చేసారా లేక మరో విధంగా జరిగిందా అనేది ఆసక్తికరమైన చర్చగా మారింది. దిల్ రాజు సినిమాలకు రెగ్యులర్ గా పనిచేసే ఫొటో గ్రాఫర్స్ పైనే అందరి దృష్టీ ఉంది. ఇక ఈ కేసుతో మిగతా ఆఫీసుల్లో కూడా జాగ్రత్త పడతారని తెలుస్తోంది.

English summary

 Shruti Hassan has lodged a complaint in CID and stating that some cleavage pictures were uploaded in online without her permission. Shruti also claimed that without assurance of producer 11 photos were uploaded. CID police have started enquiry and questioning the photographers of various websites. They are looking in the angle of who gave pictures to websites and who took the pictures.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu