»   » విలక్షణ నటుడు కళాభవన్ మణి మృతి

విలక్షణ నటుడు కళాభవన్ మణి మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొచ్చి: ప్రముఖ మలయాళ నటుడు కళాభవన్‌ మణి ఆదివారం కన్నుమూశారు. కాలేయ వ్యాధితో కొచ్చిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. వివిధ భాషల్లో ఆయన 100కు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించారు. తెలుగులో జెమిని, ఎవడైతే నాకేంటి తదితర చిత్రాల్లో నటించారు.

నటుడిగానే కాకుండా జానపద గాయకుడిగా కూడా ఆయన పేరు సంపాదించుకున్నారు. మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన మణి దాదాపుగా దక్షిణ భారత దేశంలోని అన్ని భాషల చిత్రాల్లో నటించారు. విలనిజంలోనూ తనదైన కామెడీ ముద్రను వేశారు.

Kala Bhavan Mani

జెమినీ అనే తెలుగు సినిమాలో లడ్డా అనే విలక్షణమైన పాత్రను పోషించారు. ఆ సినిమా పేరు చెప్పగానే లడ్డా గుర్తుకు వస్తుంటాడు. అంతగా ఆయన నటనలో ప్రావీణ్యం చూపించారు. కమెడియన్‌గా, విలన్‌గా సినిమాల్లో నటించిన మణి రంగస్థల నటుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు.

మలయాళంలోని పలు చిత్రాల్లో హీరోగా కూడా నటించారు. సల్లాపం అనే చిత్రంలో పోషించిన పాత్రకు ఆయనకు అనూహ్యమైన గుర్తింపు వచ్చింది. 1999లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉత్తమ నటుడి అవార్డు కూడా అందుకున్నారు. కేరళలోని చలక్కుడి అనే ప్రాంతానికి చెందిన కళాభవన్ నటుడు కాకు ముందు ఆటో డ్రైవర్‌గా పనిచేశారు.

English summary
a prominent actor Kalabhavan Mani passed away in a Kochi hospital.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu